AP Cabinet: ఇవాళ జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు సంబంధించిన కీలక అంశాలతో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల బకాయిలు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో రైతులకు అందాల్సిన బకాయిలు త్వరలో అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అంటే 2024 రబీ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మద్దతు ధర ఇంకా చెల్లించలేదు. ఈ బాకీలు ఇప్పటివరకు వేయి కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలు చెల్లించేందుకు ఎన్సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్ వేయి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ ధాన్యం బకాయి వేయి కోట్లలో తొలి విడతగా 672 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. ఇక మార్క్‌ఫెడ్ ఖాతాలో రెండు మూడు రోజుల్లో
రైతులకు చెల్లించాల్సిన నిధులు జమ కానున్నాయి. ఆ తరువాత రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి.
మొత్తానికి రైతులు దాదాపు ఏడాదిగా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల నుంచి మార్క్‌ఫెడ్ తరపున ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ సేకరించింది. ఆర్ధిక లోటు కారణంగా ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Also read: Aadhaar Card Rules: మారిన ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్, ఈ నాలుగు ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook