AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్రం నోటిఫై చేసిన రాజధాని అమరావతిలో 20,494 ఎకరాల భూ సమీకరణ చేయనున్నారు. దీనికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అమరాతిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటు రాజధాని అమరావతిలో అల్లూరి సీతరామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాలు ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు అమరావతిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది కేబినేట్. అంతేకాదు బనకచర్ల ప్రాజెక్ట్ పై కేబిటనెట్ లో చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కట్టబెట్టింది. మరోవైపు బనకచర్ల ప్రాజెక్ట్ పై పలు అభ్యంతరాలు తెలిపింది కేంద్రం. ఇది ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లనుంది. అది కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కొండలను తొలిచి సొరంగాలను నిర్మించాల్సి ఉంది. ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే.. దాదాపు మరో లక్ష కోట్ట రూపాయలు దాకా అవుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో అటవీ అనుమతులు.. ఇంకా తెలంగాణలో శ్రీశైలంలో నిర్మిస్తూన్న టన్నెల్ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోవడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు నిరాకరించారు. ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ పూర్తైయిన తర్వాత కానీ ఈ ప్రాజెక్ట్ పై ముందడగు వేసే అవకాశాలున్నాయి.
మొత్తంగా బనకచర్ల కట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇపుడున్న పరిస్థితుల్లో దేశంలో ఓ రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా.. మరో ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వడం కుదరదు. ప్రస్తుతం ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అంతగా బాగాలేదు. దీన్ని కట్టాలంటే ఇపుడు అంచనా వ్యయం అది పూర్తయే వరకు పదింతలు రెట్టింపు వ్యయం కానుంది. ఈ క్యాబినేట్ భేటి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.