Home> ఏపీ
Advertisement

Permit Rooms: ఏపీలో మందుబాబులకు ఇకపై పుల్ జోష్, కొత్తగా పర్మిట్ రూమ్స్

Permit Rooms: మందుబాబులకు ఫుల్ కిక్కిచ్చే నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే మందుబాబులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు మరో జోష్ వార్త విన్పిస్తోంది. ఇక మద్యం షాపుల వద్దే కిక్ ఎక్కుతుంది.

Permit Rooms: ఏపీలో మందుబాబులకు ఇకపై పుల్ జోష్, కొత్తగా పర్మిట్ రూమ్స్

Permit Rooms: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు మరింత కిక్ ఇవ్వనుందని సమాచారం. మద్యం షాపుల వద్దే ఇప్పుడు పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలగించిన పర్మిట్ రూమ్స్ ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

ఏపీలో మందుబాబులకు ఫుల్ జోష్ దక్కనుంది. ఇకపై మందు బాటిల్ కొన్న చోటే కిక్ లభించనుంది. మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. పర్మిట్ రూమ్స్ ను గత ప్రభుత్వం రద్దు చేసింది. పర్మిట్ రూమ్స్ లేకపోవడం వల్ల 175 కోట్ల ఆదాయం పోతుందనేది ఎక్సైజ్ శాఖ ఆలోచనగా ఉంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారు. దాంతో పర్మిట్ రూమ్స్ కు అనుమతిస్తే బహిరంగంగా మద్యం తాగడాన్ని నియంత్రించడమే కాకుండా 175 కోట్ల ఆదాయం సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. అందుకే ఇటీవల తిరుపతిలో జరిగిన సమీక్షలో పర్మిట్ రూమ్స్ చర్చ జరిగింది. తిరిగి పర్మిట్ రూమ్స్ అనుమతి ఇస్తే మంచిదని చాలామంది అధికారులు అభిప్రాయపడ్డారు. 

పర్మిట్ రూమ్ అంటే ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా కొద్దిగా స్థలం లేదా రూమ్ ఏర్పాటు చేసి అక్కడ తాగేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం ఏడాదికి ఎక్సైజ్ శాఖకు 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబరులో కొత్తగా 3,396 మద్యం దుకాణాలు వెలిశాయి. ఇవి కాకుండా గీత కులాలవారికి 340 షాపులు లభించాయి. మొత్తం షాపులకు 5 లక్షల చొప్పున 175 కోట్ల ఆదాయం సమకూరవచ్చు. అందుకే పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

వాస్తవానికి పర్మిట్ రూమ్స్ రద్దు చేసింది గత ప్రభుత్వమే అయినా ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కూడా అదే కొనసాగించింది. పర్మిట్ రూమ్స్ అనుమతిస్తే మద్యం షాపులు ఇకపై మినీ బార్లుగా మారుతాయనే కారణంతో వద్దని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఆదాయం కోల్పోవడమే కాకుండా మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగడాన్ని నియంత్రించలేకపోయారు. దాంతో అధికారికంగా అనుమతి మంజూరు చేస్తే బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడమే కాకుండా ఆదాయం సంపాదించవచ్చని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదిస్తోంది. 

Also read: UPI Payments: దేశమంతా నిలిచిపోయిన యూపీఐ సేవలు, చెల్లింపుల్లో అంతరాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Read More