Registration Act: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కొత్త రిజిస్ట్రేషన్ చట్టం ప్రవేశపెట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకట్టే వేసే నిర్ణయమిది. ఇకపై అక్రమంగా రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు లభించనుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది.
ఏపీలో రెవిన్యూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చింది. ఎక్కడైనా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపట్టితే పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు ఉండేది. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు ఈ అధికారం కట్టబెట్టింది. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పడుతుంది. అక్రమ రిజిస్ట్రేషన్ వివాదాలను ఈ కమిటీ పరిష్కరించి రద్దు చేసే నిర్ణయం తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివాదాల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2 డెడ్‌లైన్ పెట్టుకుని పని చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 10 లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సంబంధిత సర్టిఫికేట్ తీసుకోవచ్చు. 10 లక్షలు దాటిన భూములకు వేయి రూపాయలు చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవాలి. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2 వరకు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మెజార్టీ సమస్యలైతే అక్టోబర్ 2 వరకూ డెడ్‌లైన్ ఉంటుంది. ఫ్రీ హోల్డ్ భూములు, రైతులకు పాస్‌బుక్స్, రెవిన్యూ శాఖలో సమస్యలు, భూ సంస్కరణలపై సమీక్ష ఉంటుంది.
ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి భూమికి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ సమీక్షలో నిర్ణయించారు. క్యూ ఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకోవాలని నిర్ణయించారు. వివిధ రకాల భూములకు, కలర్ పాస్‌బుక్కులు కేటాయించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Also read: AP Cabinet: రైతులకు గుడ్‌న్యూస్, 2 రోజుల్లో ఖాతాల్లో ఆ డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook