AP Cabinet Decision: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్‌కు అభినందనలు తెలుపుతూనే ప్రధాని మోదీ, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. రాజధానికి సంబంధించిన తీర్మానాలను కేంద్రానికి పంపనుంది.
ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ చట్టంలో ఏపీ రాజధానిగా అమరావతిని పెట్టాలని మంత్రి మండలి ప్రతిపాదించింది. అలా చేస్తే అమరావతికి చట్టబద్ధత వస్తుందని పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి లేకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయని కేబినెట్ అభిప్రాయపడింది. చట్టంలో ఒకసారి ఏపీ రాజధానిగా అమరావతి పేరు నిర్ణయిస్తే ఇక ఎలాంటి సమస్య ఉండదని కేబినెట్ స్పష్టం చేసింది.
ఏపీ పునర్విభజన చట్టం 2014లో సవరణ చేయాలంటే పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. అందుకే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ తీర్మానం ఆమోదించేలా ప్రయత్నించనుంది ప్రభుత్వం. అందుకే ఏపీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించారు. ఏపీలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు ఇతర అంశాలపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్‌కు అభినందనలు తెలిపింది ఏపీ కేబినెట్.
Also read: Vizag Metro Stations: విశాఖ మెట్రోకు పచ్చ జెండా, మూడు కారిడార్లలో 42 స్టేషన్లు ఖరారు, ఇదే జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి