Bar License Fees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యానికి సంబంధించి శుభవార్త వినిపించింది. బార్లకు సంబంధించిన లైసెన్స్ ఫీజును ఊహించని స్థాయిలో తగ్గించింది. దీంతోపాటు నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్రి స్టార్ నుంచి ఆపై స్టార్ కలిగిన హోటల్ బార్ల లైసెన్స్, నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారీ స్థాయిలో తగ్గించడం గమనార్హం.
Also Read: Fishermen DBT Scheme: ఏపీ ప్రజలకు జాక్‌పాట్.. నేడే ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లోకి రూ.20 వేలు
బార్ల లైసెన్స్‌కు సంబంధించి నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.66 లక్షలు ఉండగా దానిని రూ.25 లక్షలకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగంతోపాటు ఆతిథ్య రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా రిజిస్ట్రేషన్ ఛార్జీ, లైసెన్స్ ఫీజులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలు, నాన్ రీఫండబుల్ ఛార్జీ రూ.20 లక్షల నిర్ధారిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: Modi Babu Meet: పాకిస్థాన్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోండి: ప్రధాని మోదీకి చెప్పిన చంద్రబాబు
దేశంలోనే ఎక్కడా లేనట్టు ఆంధ్రప్రదేశ్‌లోనే బార్ల లైసెన్స్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అత్యధికంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు, ఫీజులు తగ్గించాలని కొంతకాలంగా ఏపీ హోటల్స్ యాజమాన్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులు.. ఆందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వాటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌కు సమానంగా లైసెన్స్ ఫీజులను సవరించింది. ధరల తగ్గింపు నిర్ణయంతో ఏపీ పర్యాటకం, ఆతిథ్య రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల పర్యాటకులు, ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలు వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఈ ధరలు తగ్గించడంతో ఊరట లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.