AP Cabinet Meeting: తన మంత్రివర్గ పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా మంత్రుల పనితీరు దారుణంగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైఎస్సార్‌సీపీ నాయకులు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి చెందారు.
Also Read: YS Jagan: చంద్రబాబును నిద్ర లేపేందుకే వచ్చా.. మామిడి రైతులతో మాజీ సీఎం వైఎస్ జగన్
అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలతోపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రుల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రుల పనితీరుపై బహిరంగంగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలి' అని మంత్రులందరికీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Also Read: New Wine Industry: డ్రింకర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే వార్త.. తెలంగాణలో భారీ వైన్ పరిశ్రమ
ఇక అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదల తగ్గిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించాం. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసింది' అని తెలిపారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు స్వయంగా చదివి వినిపించారు.
Also Read: Weight Free Biryani: బిర్యానీ ఇలా ఎన్నిసార్లు తిన్నా బరువు పెరగరు.. ఎలానో తెలుసా?
వైఎస్సార్‌సీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇండోసోల్‍కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే జగన్. అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయి' అంటూ తన మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు ఈ-మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని నిర్ణయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రివర్గంలో ప్రస్తావించారు. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook