Home> ఏపీ
Advertisement

Corona Virus: శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహామ్మారి.. ఏపీలో వెలుగులోకి మరో కేసు.. ఇద్దరికి సింప్టమ్స్..?..

Corona Virus cases: ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని విశాఖలో తొలి కోవిడ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా.. మరోకేసు వెలుగులోకి వచ్చింది.
 

Corona Virus: శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహామ్మారి.. ఏపీలో వెలుగులోకి  మరో కేసు.. ఇద్దరికి సింప్టమ్స్..?..

Corona virus another covid case detected in nandyal Kadapa: కరోనా మహామ్మారి మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీలో తొలికేసు విశాఖలో నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కోవిడ్-19 పాజిటివ్‌గా తెలింది. కొన్నిరోజులుగా ఆమె జలుబు, దగ్గుతొ బాధపడుతుండటంతో ఆమె కోవిడ్ టెస్ట్ లు చేయించుకుంది. దీంతొ ఆమెకు పాజిటివ్ అని తెలింది.

వెంటనే వైద్యులు ఆమెను వారంపాటు క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు.  అదే విధంగా.. మహిళ నివాసముండే పిఠాపురం కాలనీలో మూడు టీమ్ లతో అధికారులు అందరికి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.  ఇక మరోవైపు ఏపీలో తాజాగా.. మరో కోవిడ్ కేసు వెలుగులోకి వచ్చింది.  కడప జిల్లా నంద్యాలలో మరో కోవిడ్ కేసు వెలుగులోకి వచ్చింది. నంద్యాలలోని చాగల మర్రి ప్రాంతానికి చెందిన మహిళకు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.

ఆమె కూడా కొన్ని రోజులుగా జలుబు, బాడీ పెయిన్ లతో బాధపడుతుంది.ఈ క్రమంలో  ఆమె కరోనా టెస్టులు చేయించుకొగా.. పాజిటివ్ అని తెలింది. ఆమె వయస్సు 70 ఏళ్లు. దీంతో ఆమెను రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్ లో ఇప్పటికే 20 బెడ్ లతో ప్రత్యేకంగా కోవిడ్ వార్డ్ ను ఏర్పాటు చేశారు. కరోనా కేసులు వెలుగు చూడటంతో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

Read more: Nikita Dutta: కరోనా బారిన పడ్డ మరో బాలీవుడ్ నటి, తల్లికి కూడా పాజిటివ్.. ఎమోషనల్ పోస్ట్..

బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో గుమిగూడి ఉండకూడదని చెప్పింది. మాస్క్ లు ధరించి, సామాజిక దూరంపాటించాలని, కరోనా బారిన పడకుండా.. అన్నిరకాల జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేసింది. అయితే.. నంద్యాలలో మహిళ ఉంటున్న ఏరియాలో మరో ఇద్దరికి కూడా కొవిడ్ సింప్టమ్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More