Covid 19 Guidelines: మళ్లీ కరోనా మహమ్మరి ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. విశాఖపట్టణంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయనే వార్తలతో ఆందోళన నెలకొంది. దీంతో ప్రజల్లో భయాందోళన ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని.. సీజనల్ వ్యాధులు వస్తున్న క్రమంలో కేసుల నమోదు పెరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసుల నమోదుతో ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలు విడుదల చేసి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.
Also Read: Putharekulu: వరల్డ్ ఫేమస్ ఆత్రేయపురం పూతరేకులు తింటున్నారా? మీరు డేంజర్‌లో పడ్డట్టే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం COVID-19పై అప్రమత్తత ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విడుదల చేసిన కీలక మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
Also Read: KT Rama Rao: రేవంత్ రెడ్డి దోపిడీ బాగోతం గ్రామగ్రామానికి చేరింది: కేటీఆర్
ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలు
ప్రభుత్వం వైద్యశాఖకు సూచించిన ప్రకారం మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు 24/7 ల్యాబ్స్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సహకరించి తమ ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook