Wine Shops Tender Notification: కొత్త మద్యం విధానం అమలుతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కేటాయింపు ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మద్యం దుకాణాలకు టెండర్లు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తిగల వారికి అవకాశం కల్పించింది. అయితే ఈ మద్యం దుకాణాలు మాత్రం అందరికీ కాకుండా కొందరికే కేటాయించనున్నారు. ఒక వర్గానికి మాత్రమే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Pending Arears: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. త్వరలో పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు
మద్యం దుకాణాల కేటాయింపులో గీత కులాలకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. గీత సామాజికవర్గానికి 335 మద్యం దుకాణాలు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ దుకాణాల లైసెన్స్ గడువు 30 సెప్టెంబర్ 2026 వరకు ఉంటుంది. తాజాగా ఆ మద్యం షాప్‌లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి దుకాణాల కోసం దరఖాస్తుల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్‌లు ఎంపిక చేయనున్నారు.
Also Read: IPS Officers Transfers: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.