Simhachalam Giri pradarshana: బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సింహగిరి దిగువన ఉన్న తొలిపావంచా నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ 32 కిలోమీటర్ల మేర సాగిన తరువాత నేడు మళ్లీ తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది.సింహాచలంలో గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం సాయంత్రం వరకూ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. అయితే రోడ్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. గిరి ప్రదక్షిణ కారణంగా వెంకోజిపాలెం వద్ద ట్రాఫిక్ జాం అయింది.
గంటల తరబడి ముందుకు కదిలే ఛాన్స్ లేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హనుమంతువాక నుంచి మద్దిలపాలెం వరకు ట్రాఫిక్ జాం అయింది. ప్రణాళిక లేకుండా ట్రాఫిక్ మళ్లించడంతో వాహన రద్దీ ఏర్పడింది. ఈ ప్రభావం నగరంపై పడింది. తొలిపావంచా వద్ద పలుసార్లు భక్తుల తోపులాటలు చోటుచేసుకున్నాయి.
సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. 6 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి , 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 32 వైద్య శిబిరాలు కల్పించారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. మొత్తంగా అరుణాచలంలో ఈ గిరి ప్రదిక్షణ ఉంటుంది. అటు యాదగిరి గుట్టలో కూడా గిరి ప్రదిక్షణ ఉంటుంది. అటు హిమాలయాల్లో కొలువైన మానస సరోవరంలో గిరి ప్రదిక్షణ చేస్తుంటారు భక్తులు. ఏది ఏమైనా దేవుడు కొలువైన కొండ చుట్టూ తిరిగి గిరి ప్రదిక్షణ చేయడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయమే.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.