woman in Tiruchanoor Sri Padmavati Ammavaari Temple: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా కామాంధులు మారడంలేదు. ప్రతిరోజుమహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అన్నికంపార్ట్ మెంట్ లు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.
ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నటుల సమాచారం. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుచానురులోని పద్మావతి ఆలయంలో ఇటీవల ఒక మహిళ స్వామిజీ వెంట లఘుదర్శనం కోసం వచ్చింది. అప్పుడు అక్కడ విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి వివాహితను అసభ్యంగా తాకి పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ దీనిపై సీరియస్ అయ్యింది. గట్టిగా ఉద్యోగిని నిలదీయగా అక్కడున్న సిబ్బంది వెంటనే వచ్చి.. మహిళకు సారీ చెప్పారు.
విషయం బైటకు తెలిస్తే పరువు పోతుందని మహిళతో కాళ్ల బేరానికి దిగారు. కానీ మహిళ మాత్రం భక్తుల ముందే అక్కడున్న సిబ్బందిని నిలదీసింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో సైతం రికార్డు అయ్యింది. మరోవైపు..సదరు మహిళకు అమ్మవారి పువ్వులు,ప్రసాదాలు ఇచ్చి మరీ ఇలాంటి జరగవని చెప్పారు.
Read more; Tirumala: తిరుమల భక్తులకు మరో ప్రసాదం.. టీటీడీ కీలక నిర్ణయం, ఇకపై ఉచితంగానే..!
అయితే.. సదరు మహిళ మాత్రం దీనిపై టీటీడీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే అక్కడున్న వారు రాజీకీ యత్నించారు. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ..ఏవీఎస్వో రాధాకృష్ణను సంప్రదించగా దీన్ని ఆయన ఖండించారు. క్యూలైన్ లలో మహిళలను ముందుకు పంపుతుండగా.. ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఆయన చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook