TTD AEO Suspend: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastan)టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై టీటీడీ ఉన్నతాధికారులు వేటు వేసారు. గత కొన్నేళ్లుగా ఆయలంలో ఏఈవోగా పనిచేస్తోన్న రాజశేఖర్ ఈయన అన్యమత ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో ఆ స్వామి తప్ప మరే అన్యమత దేవుడికి స్థానం లేదు. అలాంటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఏఈవో తరుచుగా అన్యమత ప్రార్ధనల్లో పాల్గొంటున్నట్టు ఓ భక్తుడి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి అది నిజమని తేలడంలో ఆయన సస్పెన్షన్ వేటు వేసింది. తిరుమలలో స్వామి వారి డబ్బుతో అన్న రాజభోగాలు అనుభవిస్తున్న ఇలాంటి అధికారులు, ఉద్యోగులు చాలా మందే ఉన్నారు. స్వామి తిండి తింటూ పరాయి మతం పాట పాడే ఇలాంటి అధికారులు తిరుమల సహా అన్ని ఆలయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. వాళ్లందరిని కూడా ఇలాంటి తరహాలో వేరే డిపార్టెమెంట్ ట్రాన్స్ ఫర్ చేయడమే చేయకపోతే.. హిందూ దేవాలయా ఉనికికే ప్రమాదం అని భక్తులు చెబుతున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రభుత్వాలు ఇలాంటి అన్యమత అధికారుల తీరును చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో ఇలాంటి వాళ్లు చెలరేగిపోతున్నారు. తమకేమి అవ్వదులే అన్న మితీమీరిన భరోసాతో బరి తెగిస్తున్నారు. ఇలాంటి అధికారులకు దేవాదాయ శాఖలో ఎన్నో ఏళ్లుగా తిష్ఠ వేసుకొని స్వామికే మోసం చేస్తున్నారు.
హిందూ దేవుళ్లను నమ్మని ఇలాంటి అధికారులు దేవుడికి కైంకర్యం చేసే పూజారితో పాటు ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్కరిపై చులకన భావంతో ప్రవర్తిస్తున్న ఘటనలు కోకొల్లలు. కొంత మంది అన్యమత అధికారులు దేవ దేవుడిని పూజించే పూజారులను టార్గెట్ చేయడం .. వారిని టార్చర్ పెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం టీటీడీలోనే కాదు.. ఆంధ్ర ప్రదేశ్ లో పలు దేవాలయాల్లో పనిచేసే గాది కింది పంది కొక్కులు చాలా మందే ఉన్నారు. వారిని ఏరివేయకపోతే.. సనాతన హిందూ సంప్రదాయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇకనైనా.. తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఇలాంటి అన్యమతానికి చెందిన వారిని ఏరివేయాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు. అందుకు ప్రభుత్వం నిజాయితీ పరులైన ఎలాంటి ప్రలోభాలకు లొంగనలి విజిలెన్స్ అధికారులను నియమించి ఇలాంటి అధికారులను వేటు వేయడమే.. బదిలీ చేయడమే చేయాలి.
టీడీటీ ఏఈవో రాజశేఖర్ విషయానికొస్తే.. ఆయన అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్నాడని టీటీడీ విచారణలో తేలింది. ఈ మేరకు రాజశేఖర్ బాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజశేఖర్ బాబు గత కొంతకాలంగా పుత్తూరులో అన్యమత ప్రార్థన (చర్చి ప్రార్ధన)లకు హాజరవుతున్న విషయాన్ని ఓ భక్తుడు ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకువచ్చాడు. ఈ కంప్లైంట్ ఆధారంగా ఆయన విచారణ చేపట్టింది. అంతేకాదు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారణ చేపట్టి రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం నాడు చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరవుతున్నట్టు నిర్ధారించుకుంది. ఇది టీటీడీ నియమావళికి విరుద్ధం కావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.