Jagan Bangarupalyam tour for support mango farmers: మాజీ సీఎం జగన్ పర్యటనలో మరోసారి ఊహించని ఘటన చోటు చేసుకుంది. గతంలో జగన్ పల్నాడు , సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఇద్దరు కాన్వాయ్ తొక్కిసలాటలో చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు కేసుల్ని సైతం నమోదు చేశారు.
అయితే.. మరోసారి జగన్ పర్యటన ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే.. ఏపీ పోలీసులు ఇప్పటికే పలు సూచనలు సూచనలు చేశారు. అయిన కూడా భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు పోటీపడ్డారు.
బంగారుపాళ్యంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్ లో నుంచి వైసీపీ నేత విజయనందరెడ్డి కిందకు పడిపోయారు. ఒక పోలీసు కానిస్టేబుట్ సైతం మూర్చబోయాడు. కొంత మంది వైసీపీ కార్యకర్తల్ని.. ఎవరో కొట్టారని తెలియడంతో కారు నుంచి జగన్ కిందకు దిగారు. దీంతో ఎస్పీ రంగంలోకి దిగి మరీ జగన్ ను కాన్వాయ్ ఎక్కించారు.
ఈ నేపథ్యంలో జగన్ మామిడి పండ్ల రైతుల కోసం సంఘీభావంగా కార్యక్రమం చేపట్టారు. మరోవైపు దీనిపై కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. ఇక అయిన రాజకీయ డ్రామాలు అపాలన్నారు. జగన్ పర్యటన ప్రజా సమస్యల కోసం కాదు.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈక్రమంలో.. మామిడి మార్కెట్ సమీపంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యంలను పంపిణి చేశారన్నారు. మద్యం కోసం వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిలో ఒక కార్యకర్త తలకు గాయమైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న.. పోలీసు అధికారి తన కర్చీఫ్‌తో కట్టుకట్టి మరీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జగన్ పోలీసులు కొంత మంది వైసీపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారని సీరియస్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook