Ys Jagan fires on ap chandrababu govt: ఆంధ్రప్రదేశ్ లో కూటమి రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ బుధవారంనాడు వెన్నుపోటు దినోత్సంను నిర్వహించి నిరసనలు వ్యక్తం చేయాలని ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. వైఎస్ జగన్.. గుంటూరు తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలకు చంద్రబాబు, నారాలోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలను అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు సర్కారు అధికార దుర్వినియోగంకు పాల్పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల గొంతు విన్పిస్తున్న తన గొంతు అణగతొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అంతే కాకుండా.. చంద్రబాబు దగ్గరుండీ మరీ.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెట్టి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. తెనాలిలో.. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న దోమ రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరీముల్లా ఉన్నారని, దళితులు, మైనార్టీ వర్గాలపై పోలీసులు అన్యాయం దాడి చేశారని జగన్ ఆరోపించారు.
దోమా రాకేష్ జోమోటోలో హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడని, పాత కేసు విచారణ వాయిదా కోసం తెనాలి వచ్చాడని, అతను హైదరాబాద్‌లో ఉంటున్నాడని, తెనాలి రావడంతో అతడిని చూడటానికి అతని స్నేహితులు మంగళగిరి నుంచి వచ్చారని జగన్ వివరించారు.
విక్టర్ జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడని, అతనితో పాటు మంగళగిరి నుంచి మెకానిక్ కరీముల్లా కలిసి తెనాలి వచ్చారని, 24 వ తేదీ ఐతానగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉండగా సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ అక్కడ మరో యువకుడితో గొడవ పడుతుండగా వారిని విడదీశారని జగన్ చెప్పారు.
కానిస్టేబుల్ జాన్ విక్టర్ బైక్ తాళాలు, ఫోన్ లాక్కోవడంతో మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగిందన్నారు. ఏప్రిల్ 24వ తేదీన గొడవ జరగ్గా.. ఏప్రిల్ 25న మంగళగిరి వెళ్లిన పోలీసులు విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారని, తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కొట్టారని, ఏప్రిల్ 26వ తేదీన రోడ్డు మీద బహిరంగంగా కొట్టారని, ఇదే ఘటన టూటౌన్ సీఐతో పాటు పక్కన ఉన్న మరో సీఐ కలిసి వారిని కొట్టారని జగన్ పలు విషయాల్ని చెప్పుకొచ్చారు.
అదే విధంగా.. విక్టర్ జేబులో కత్తి పెట్టి, ఇద్దరు వీర్వోలను మారణాయుధాలు, కత్తులు ఉన్నట్టు పంచనామా రాశారని చెప్పారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు లేవని సర్టిఫికెట్ తీసుకుని 28నకోర్టులో హాజరు పరిచారని, పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని చెబితే ఎస్పీ ఆఫీసుకు తీసుకువెళ్లి కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారని ఆరోపించారని జగన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read more: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జాక్‌పాట్.. అక్కడ జనసేనకు తొలి విజయం
పోలీసులు దగ్గరుండి, ప్రతి నియోజక వర్గంలో మామూళ్లు వసూలు చేస్తున్నారని, పర్మిట్ రూమ్, బెల్ట్ షాప్‌లకు డబ్బులు వసూలు చేసి చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు చెల్లిస్తున్నారని జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఇసుక, క్వార్ట్జ్, లాటరైట్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook