ys Sharmila fires on vizag yoga day yogandhra event video: అంతర్జాతీయ యోగాదినోత్సవం నేపథ్యంలో వైజాగ్ లో యోగాంధ్ర ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ యోగాడే ఈవెంట్ కు ప్రధాని మోదీ హజరయ్యారు. ఈ క్రమంలో యోగాకు అనేక మంది గిరిజన విద్యార్థుల్ని పలు జిల్లాల నుంచి ప్రభుత్వం తరలించింది. దీనికోసం వచ్చిన గిరిజన బిడ్డలు, అనేక మంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొన్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ మండిపడ్డారు. యోగాంధ్ర గిన్నిస్ బుక్ హిస్టరీ క్రియేట్ చేయాలని కూటమి ప్రభుత్వం మరీ నీచంగా ప్రవర్తించిందని ఎక్స్ వేదికగా షర్మిల సంచలన పోస్ట్ పెట్టి, వీడియో కూడా షేర్ చేశారు.
కూటమి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరింది. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా ? తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చుతారా ? వేలమంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా ? వాళ్లను పిల్లలు అనుకున్నారా..… pic.twitter.com/Du8c7xagYa
— YS Sharmila (@realyssharmila) June 21, 2025
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై షర్మిల శివాలెత్తిపోయారు. చంద్రబాబు ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరిందన్నారు. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా ?.. కనీసం వారికి తిండి కూడా పెట్టలేదన్నారు. వేలాది మంది బిడ్డలను ఒకే రూముల్లో వేసి కుక్కుతారా..?..అని మండిపడ్డరు. గిరిజన బిడ్డల్ని గొర్రెల్లా ఒకటే రూముల్లో కుక్కినారని మండిపడింది. మోదీ మెప్పు కోసం మరీ ఇంత దిగజారుడు అవసరమా అంటూ మండిపడింది.
యోగా కోసం బిడ్డల ప్రాణాలను ఫణంగా పెడతారా ?.. మోడీ గారు షేమ్..షేమ్.. అంటూ సెటైర్ లు వేశారు. గిన్నిస్ రికార్డ్ యోగాంధ్ర కు కాదు .. 27 వేల మంది గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలంటూ పంచ్ లు షర్మిల పంచ్ లు వేశారు. హంతకులు.. శ్రీరంగ నీతులు చెప్పినట్లుందని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణం తీస్తూ, కార్మికుల పొట్టలు కొడుతూ.. ఆరోగ్యం కోసం యోగా చేయమని అదే విశాఖలో మోడీ గారు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
6 నెలల్లో 2 సార్లు విశాఖలో పర్యటించిన మోడీ గారికి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించదు. కార్మికుల ఆవేదన వినిపించదు. ఆదుకుంటామని, ప్రైవేటీకరణ లేదని చెప్పే దమ్ము మాత్రంలేదని షర్మిలఎద్దేవా చేశారు.
విభజన హమీలు, పొలవరంఎత్తు తగ్గింపు, ఇండస్ట్రీయల్ కారిడార్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు లేదు. ఇలా అనేక రకాలుగా ప్రధాని మోదీ.. ఏపీ ప్రజల్ని మోసం చేశారని షర్మిల తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook