YS Jagan Tour Deaths: బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారికి జగన్ పరామర్శ చేయడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏమిటి? సమాజం ఎటు పోతుందని నిలదీశారు. బల ప్రదర్శనలు కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని వైఎస్ జగన్‌కు షర్మిల సూచించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి చంద్రబాబు బలప్రదర్శనలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే తనకు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. జగన్ పర్యటనలకు ఆంక్షలు ఎందుకు లేవనే విషయమై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Employees Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఎందుకో తెలుసా?
విజయనగరంలో గురువారం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడారు. 'ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆంక్షలు కాంగ్రెస్ పార్టీకేనా? మేము రాజధాని మీద పోరాటం చేస్తే గృహ నిర్బంధం చేస్తారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారు. ఆంక్షలు అన్ని కాంగ్రెస్ పార్టీకేనా?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారా? వైఎస్సార్‌సీపీ పరామర్శల పేరు మీద చేసే యాత్రలకు ఆంక్షలు ఉండవా? అని నిలదీశారు.
Also Read: YS Sharmila: జగన్, కేసీఆర్ కలిసి నాపై కుట్ర పన్నారు: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
'వైఎస్ జగన్ మోడీ దత్త పుత్రుడు అని ఆంక్షలు పెట్టడం లేదా? జగన్ మీద ఎందుకు ఆంక్షలు లేవు? బల ప్రదర్శన మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదు? జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా? చంద్రబాబు సమాధానం చెప్పాలి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ పర్యటనలో ఇద్దరి మృతికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. మీరంతా బీజేపీ మద్దతు దారులే అని జగన్‌ను ఆపకుండా ఉన్నారని ఆరోపించారు.
'బీజేపీతో జగన్ అక్రమ పొత్తు కాబట్టి ప్రేక్షక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా సమాధానం చెప్పాలి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బెట్టింగ్‌లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడం ఏమిటని ప్రశ్నించారు. సమాజం ఎటు పోతుంది? దానికి జగన్ వెళ్లడం ఏమిటని నిలదీశారు. ప్రజా నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని హితవు పలికారు. 'సూపర్ సిక్స్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు మీద ఉద్యమాలు చేయాలి' అని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook