YS Jagan Singaiah Death: 'వైఎస్ జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకమని వైఎస్ షర్మిల తెలిపారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఈ ఘటన ఉందని చెప్పారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏమిటని ప్రశ్నించారు. వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏమిటని నిలదీశారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారని మండిపడ్డారు. బెట్టింగ్‌లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాజకీయం.. ఇదెక్కడి రాక్షస ఆనందమని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
Also Read: YS Sharmila: ఏ ముఖం పెట్టుకొని ఏపీకి మోడీ వస్తున్నారు? వైఎస్ షర్మిల నిలదీత
'మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యాన్ని అద్దం పడుతుంది. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ వంద మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి' అని వైఎస్ షర్మిల తెలిపారు.
Also Read: TDP MLAs: 'మీ పనితీరు అస్సలు బాలేదు'.. టీడీపీ ఎమ్మెల్యేలకు నారా లోకేశ్ వార్నింగ్
'అనుమతికి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఇంటలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్‌లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఏం చర్యలు తీసుకుంటున్నారు?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook