Home> బిజినెస్
Advertisement

Cars24 Lays Off: ఐపీఎల్‌లో, సొంత కంపెనీలో ధోనీకి కష్టాలు.. ఒక్కసారిగా 200 ఉద్యోగులను తొలగింపు

Cars24 Lays Off 200 Employees Know Why: ప్రముఖ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ కంపెనీలో భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపు జరిగింది. సంస్థ నష్టాల్లో ఉండడంతో 200 మంది ఉద్యోగులను తొలగించడం సంచలనంగా మారింది. ఎందుకు? ఏమిటి? ఆ వివరాలు తెలుసుకుందాం.

Cars24 Lays Off: ఐపీఎల్‌లో, సొంత కంపెనీలో ధోనీకి కష్టాలు.. ఒక్కసారిగా 200 ఉద్యోగులను తొలగింపు

Cars24 Lays Off: ఐపీఎల్‌లో పరాభవం ఎదుర్కొంటున్న ఎంఎస్‌ ధోనీ తన కంపెనీలో కూడా కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కంపెనీలో భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా తొలగిస్తుండడంతో ఉద్యోగులు రోడ్డుపై పడనున్నారు. ఈ విషయాన్ని ధోనీ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అసలు ఉద్యోగాల తొలగింపు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత కష్టమేమి వచ్చిందో తెలుసుకుందాం.

Also Read: Harish Rao: 'కేసీఆర్‌ను చూడాలి.. కేసీఆర్ ప్రసంగం వినాలి' అనేదే ప్రజల అభిమతం

భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌తోపాటు ప్రవృత్తిగా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు. అందులో కీలకమైన వ్యాపారం కార్లను అమ్మడం, కొనడం చేసే 'కార్స్‌24' అనే సంస్థ ఉంది. పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి కేంద్రంగా ఉన్న 'కార్స్‌24' సంస్థలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలను పునఃనిర్మించడానికి లేఆఫ్స్‌ ప్రకటించారు. వారిలో 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్‌ చోప్రా తెలిపారు.

Also Read: Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

కంపెనీ కార్యకలాపాలు కొత్తగా.. పూర్తిగా ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా ఈ లేఆఫ్స్‌ ప్రకటించినట్లు విక్రమ్‌ చోప్రా ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల తొలగింపు అనేది నిరంతర లేఆఫ్స్‌ ఉండవని స్పష్టత ఇచ్చారు. ఇక కొత్తగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్స్ 24 నియామకాల్లో కఠినమైన విధానాన్ని అనుసరిస్తామని విక్రమ్‌ చోప్రా తెలిపారు. కార్స్‌ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తోందని.. ఈ క్రమంలోనే ఉద్యోగాల తీసివేత జరుగుతున్నాయని వెల్లడించారు.

గతంలో పాత కార్ల అమ్మకం, కొనుగోలు వ్యాపారం అద్భుతంగా సాగడంతో కార్స్‌ 24 సంస్థ బాగా రాణించింది. ప్రస్తుతం వాహనదారుల ధోరణి మారుతుండడంతో ఆ సంస్థకు ఆశించిన స్పందన లభించం లేదు. ఈ క్రమంలో ప్రజల ఆలోచనలు.. అభిష్టానికి తగ్గట్టు కార్స్‌ 24 మిగిలిన సేవల్లోకి విస్తరిస్తోంది. ఇటీవల దేశపు అతిపెద్ద ఆటోమోటివ్‌ ఫోరమ్‌ టీమ్‌ బీహెచ్‌పీని ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్‌, ఇన్సురెన్స్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలను కూడా కార్స్‌ 24 సంస్థ ప్రారంభించింది. కాగా ఈ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. 2024-25 ఆర్థిక సంసత్సరంలో రూ.498 కోట్ల నష్టం చవిచూసినట్లు కార్స్‌ 24 ప్రకటించింది. దీంతో సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగానే 200 మంది ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More