Home> బిజినెస్
Advertisement

Credit Card Usage: క్రెడిట్ కార్డ్ లు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పులపాలవ్వడం ఖాయం

Credit Card Disadvantages: ప్రతి ఒక్కరి జీవితాలు క్రెడిట్ తీసుకున్న తరువాత.. తీసుకోకముందు అన్నట్లు ఉంటుంది. ఒక్కసారి తీసుకున్న తరువాత ప్రతి నెలా బిల్ కట్టేందుకు ఇబ్బందులు పడుతుంటారు. బెనిఫిట్స్ సంగతి పక్కన పెడితే.. ఒక్కసారి బిల్ పేమెంట్ లేట్ అయితే మాత్రం వడ్డీకి చక్రవడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

Credit Card Usage: క్రెడిట్ కార్డ్ లు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పులపాలవ్వడం ఖాయం

Credit Card Disadvantages: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‎లు చాలా సాధారణం అయ్యాయి. ఇవి కస్టమర్లకు షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, లోన్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే.. క్రెడిట్ కార్డ్‎లతో కొన్నిసార్లు బెనిఫిట్ ఉంటుంది. కానీ వాటిని జాగ్రత్తగా ఉపయోగిస్తే మాత్రమే.. లేకపోతే మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే క్రెడిట్ కార్డ్‌ పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని కరెక్ట్ గా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం.. ఫస్ట్ టైమ్ కార్డ్‌ వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్‌ హిస్టరీ బిల్డ్‌ చేయడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హౌసింగ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌...ఇలా ఏ లోన్ తీసుకోవాలనుకున్నా ఈ హిస్టరీనే మీకు ఆధారం. అందుకే మీ మొదటి కార్డ్‌ దగ్గరి నుంచి మీ క్రెడిట్‌ హిస్టరీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే భవిష్యత్తులో అప్పు కోసం ఇబ్బంది పడటం మాత్రం తథ్యం. మొదటిసారి క్రెడిట్ కార్డ్‌ వాడే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

ఫస్ట్ మీకు క్రెడిట్ కార్డ్ అవసరమో.. లేదో.. తెలుసుకోండి

మొదట మీరు క్రెడిట్‌ కార్డ్‌ ఇంపార్టెన్స్‌ ను గుర్తించాలి. ఎమర్జెన్సీ టైమ్ లో అప్పు తీసుకోకుండా ఈ క్రెడిట్‌ కార్డ్‎లను వాడుకోవచ్చు. కార్డ్‎ను వాడిన తరువాత 40 రోజుల వరకూ ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. గడువు లోపు అప్పు తీర్చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ లోన్ ట్రాప్‌లో ఇరుక్కుని, అనవసర ఖర్చుల జోలికి వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది..

కొంతకాలం ఒక్క కార్డే వాడటం బెటర్..

మీరు మొదటి క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత.. ఒక్క కార్డుకే పరిమితమవ్వండి.. మీ క్రెడిట్‌ హిస్టరీ పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి.. దాని కోసం వన్ ఇయర్ టైమ్ ఇవ్వండి. ఈలోపు ఏవైనా బ్యాంకులు కార్డులు లేదా లోన్స్ ఇవ్వడానికి వస్తే వాటిని రిజెక్ట్ చేయడం బెటర్.మెల్లిగా క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోండి. అలాగే మీ పేమెంట్ సైకిల్‌ బాగుంటే సదరు బ్యాంకే మీ క్రెడిట్‌ లిమిట్ పెంచుకుంటూ వెళ్తుంది. లిమిట్‌ మొత్తం వాడేయకండి..మీకు బ్యాంక్‌ రూ.100 క్రెడిట్‌ లిమిట్‌ ఇస్తే, గరిష్టంగా రూ.20-30 వరకూ మాత్రమే వినియోగించుకోండి.

మొదటి క్రెడిట్ కార్డును రద్దు చేయకండి..

మన మొదటి క్రెడిట్‌ కార్డ్‌ మన మొత్తం క్రెడిట్‌ హిస్టరీకి మూలం. ఎందుకంటే హిస్టరీ ఎంత పాతగా ఉంటే.. మన క్రెడిట్‌ ప్రొఫైల్‌ అంత పటిష్టంగా ఉంటుంది. ఒకవేళ కార్డు రద్దు చేయాల్సి వచ్చినా.. మొదటి కార్డును మాత్రం చేయకండి. మీ ఓవరాల్‌ క్రెడిట్‌ హిస్టరీలో ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా ఫస్ట్‌ లోన్‌ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే మీ రిపోర్ట్‌ తయారవుతుంది. ఇది బాగోకపోతే భవిష్యత్ లో హౌసింగ్‌ లోన్‌, వెహికల్ లోన్‌, పర్సనల్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌ తీసుకోవడానికి ఇబ్బంది కావొచ్చు.

గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటో తెలుసా..?

పేమెంట్‌ రిమైండర్స్‌ పెట్టుకోండి. క్రెడ్ లాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఇందుకోసం ఉపయోగపడతాయేమో చూడండి. మీ పేమెంట్స్‌ సాధ్యమైనంత వరకూ ఆటోమేట్‌ చేసుకోండి. బ్యాంక్‌ నుంచి ఆటో పేమెంట్‌ ఫెసిలిటీ పెట్టుకుంటే రీపేమెంట్‌ చింత ఉండదు. కొన్ని సంస్థలు కనీస బకాయి, మరికొన్ని పూర్తి పేమెంట్‌ను మీ అకౌంట్‌ నుంచి డిడక్ట్‌ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తున్నాయి. వాటిని వినియోగించుకోండి.. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ ఫెసిలిటీ వాడుకోండి. ఆటోమేటిక్‌ పేమెంట్‌ క్లియరెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి.. ఆలస్య చెల్లింపులకు దూరంగా ఉండండి, కనీస చెల్లింపు ట్రాప్‌లో పడొద్దు..అవసరానికి మాత్రమే క్రెడిట్‌ కార్డ్ వినియోగించుకోండి..

Also Read: Psychology: సైకాలజీ ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్న వారితో స్నేహం చేస్తే మీ బతుకు బస్టాండే..!!   

Also Read: YS Jagan: చంద్రబాబును నిద్ర లేపేందుకే వచ్చా.. మామిడి రైతులతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Read More