SIP Investment: రాజేశ్ ఒక ప్రైవేటు ఉద్యోగి. అతనికి ప్రతి నెలకు 30 వేల రూపాయల వేతనం లభిస్తుంది. రాజేశ్ వయసు 25 సంవత్సరాలు. వివాహం చేసుకున్నాడు. కుమార్తె జన్మించింది. అయితే తన స్నేహితులు, తల్లిదండ్రుల సలహా మేరకు అమ్మాయి పేరు మీద ప్రతినెలా కొంచెం డబ్బులు దాచాలనుకున్నాడు. అయితే సురేశ్ కు చాలామంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బు దాచుకోమని సలహా ఇచ్చారు. మరి కొంతమంది బ్యాంకులో రికరింగ్ రూపంలో డబ్బు దాచుకోమని సలహా ఇచ్చారు. కానీ ఒక స్నేహితుడు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చని పేర్కొన్నాడు.
దీంతో రాజేశ్ మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకొని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP ) రూపంలో ప్రతినెల 5000 రూపాయలు అమ్మాయి పేరిట ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాడు. ప్రతి నెల 5000 రూపాయల చొప్పున 21 సంవత్సరాల పాటు అమ్మాయి పేరిట మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాడు. సంవత్సరానికి 12 శాతం రాబడి చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేయగా, అతనికి 21 వ సంవత్సరం 52,15,034 రూపాయాల ఫండ్ ఏర్పడింది. అయితే ఇందులో ప్రతినెల 5000 రూపాయలు చొప్పున 21 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే, అతడు పొదుపు చేసిన మొత్తం 12,60,000 రూపాయలు మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. దీనిపై అదనంగా 39,55,034 రూపాయలు లభించాయి. దీని వల్ల 50 లక్షల రూపాయలకు పైగా ఫండ్ జమ అయ్యింది.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అనేది నిజానికి పరోక్షంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాంటిదే అని గుర్తుంచుకోవాలి. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్కుతో కూడిన పని. కానీ అదే సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ప్రత్యామ్నాయ మార్గం, మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఎంపిక చేసిన స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి. వీటిని నిర్వహించేందుకు ఫండ్ మేనేజర్ ఉంటారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉన్నప్పటికీ, గడచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్ సూచీలు చక్కటి రాబడి అందిస్తున్నట్లు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
పాప చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే..పాప ఎదిగే సరికి మంచి నిధి సమకూరుతుంది. అప్పుడు దర్జాగా ఎలాంటి ఫికర్ లేకుండా కూతురు పెళ్లి చేయోచ్చు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook