GOLD INVESTMENT TIPS: బంగారం ఎవరికి చేదు చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్లకి బంగారంపై ఎనలేని మక్కువ ఉంటుంది. ఎప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుందా..? ఎప్పుడు కొనుక్కుందామా..? అని ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం బంగారం ధర విపరీతంగా పెరిగి పోవడంతో.. అవసరమైతే తప్ప బంగారం జోలికి వెళ్లడం లేదు.
బంగారం ధర ఎందుకింత పెరిగింది..
నిజం చెప్పాలంటే డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుండి.. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే.. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది.దీంతో స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు.అటు ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా రష్యా -యుక్రెయిన్ యుద్ధం కారణంగా కూడా చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.
ఇంకా పసిడి ధర పెరగనుందా..
రూపాయి పతనం అయినప్పుడు.. ప్రజల చూపు డాలర్ మీద కాకుండా.. బంగారం మీద పడుతుండటంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది. అయితే బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.
మరి నిపుణులు ఏమంటున్నారు..
బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. రేటు తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్‌లో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. గోల్డ్ ETF లాంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా గోల్డ్ కొనేవారు.. ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ తో లాభమేనా..
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్. వీటికి డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు. కనీసం 500 రూపాయలతో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ పెట్టుబడిని ఫండ్ మేనేజర్స్ ప్రముఖ మైనింగ్ కంపెనీస్ షేర్లలో లేదా భౌతిక రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిని కూడా మార్కెట్ సమయాల్లో ఎప్పుడైనా పెట్టుబడిని రిడీమ్ చేసుకోవచ్చు. SBI, HDFC, యాక్సిస్ సహా మరికొన్ని బ్యాంక్ లు.. గోల్డ్ ఫండ్స్ నిర్వహిస్తున్నాయి.
ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది మీరే..
ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహమేనా అన్నది కాస్తా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన విషయం.ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితులు బాగోలేవు. ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో మంచి అవకాశం . అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
Also Read: 5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook