Home> బిజినెస్
Advertisement

SBI VS HDFC: ఎస్బీఐ వర్సెస్ హెచ్‎డీఎఫ్‎సీ ఈ రెండు బ్యాంకుల్లో.. హోంలోన్ వడ్డీ రేట్లు ఎందులో తక్కువ అంటే..?

SBI VS HDFC: సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు ఖర్చు చేసి ఇల్లు కొనలేని వారు హోంలోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు హోంలోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, హెచ్డీ ఎఫ్ సీ బ్యాంకుల్లో ఎందులో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం. 

SBI VS HDFC: ఎస్బీఐ వర్సెస్ హెచ్‎డీఎఫ్‎సీ ఈ రెండు బ్యాంకుల్లో.. హోంలోన్ వడ్డీ రేట్లు ఎందులో తక్కువ అంటే..?

SBI VS HDFC:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన తర్వాత హోంలోన్స్ చాలా చౌకగా మారాయని చెప్పవచ్చు. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించాయి. అయితే దేశంలోని రెండు పెద్ద బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  HDFC బ్యాంక్ నుండి హోంలోన్ తీసుకునేటప్పుడు, ఈ రెండు బ్యాంకుల్లో ఏ బ్యాంకులో మీకు తక్కువ వడ్డీ రేటుకు హోంలోన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మీ సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ స్కోర్ కూడా అద్భుతంగా ఉన్నట్లయితే..మీరు తక్కువ వడ్డీరేటుకే హోంలోన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే మీ సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉండాలి. ఉదాహరణకు ఒక కస్టమర్ 20ఏళ్ల ఈఎంఐ చెల్లింపు కోసం ఈ బ్యాంకుల నుంచి రూ. 60లక్షల హోంలోన్ తీసుకుంటే..ఏ బ్యాంకు నుంచి తక్కువకు లభిస్తుందో చూద్దాం. 

SBI హోంలోన్: 
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకు అయిన  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ రేటుకు హోంలోన్ అందిస్తోంది.  మీరు 20ఏళ్ల పాటు  7.50 శాతం వడ్డీకి ఎస్బీఐ నుండి రూ. 60 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే..ఎస్బిఐ హోంలోన్ కాలిక్యులేటర్ ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ. 48,336 అవుతుంది. ఈ లోన్ కు బదులుగా  మీరు  రూ. 56,00,542 వడ్డీగా మాత్రమే చెల్లిస్తారు. ఈ విధంగా చివరికి మీరు మొత్తం రూ. 1,16,00,542 బ్యాంకుకు చెల్లిస్తారు. హోంలోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు నిబంధనల ప్రకారం, మీరు ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చు అని గుర్తుంచుకోండి. అయితే ఈ మధ్య కాలంలో  కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండానే లోన్స్ ఇస్తున్నాయి. 

Also Read:   Business Ideas: లేడీస్.. రూ. 1500లతో ఈ కోర్సు నేర్చుకోండి.. ఇంట్లో కూర్చుండి నెలకు రూ. 1లక్ష సంపాదించడం పక్కా..!!

HDFC బ్యాంక్ హోంలోన్: 
 ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ నుంచి మీరు హోంలోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే..ప్రస్తుతం  7.90శాతం ప్రారంభ వడ్డీ రేటుకు అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ నుండి ఈ వడ్డీ రేటుకు హోంలోన్ పొందుతుంటే, 20ఏళ్ల చెల్లింపు కోసం రూ. 60 లక్షల హోంలోన్ కు ఈఎంఐ రూ.49,814 అవుతుంది. అంటే లెక్క ప్రకారం మీరు ఈ లోన్ కు రూ. 59,55,273 మాత్రమే తిరిగి చెల్లించాలి. అంటే చివరికి మీరు మొత్తం రూ. 1,19,55,273  బ్యాంక్‌కు తిరిగి ఇవ్వాలి.  

ఎందులో వడ్డీరేట్లు తక్కువ? 
మీ సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు అతి తక్కువ వడ్డీ రేటుకు హోంలోన్ పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.ఈ రెండు బ్యాంకుల హోంలోన్స్  పోల్చినప్పుడు ఎస్బిఐ నుంచి హోంలోన్ తక్కువ వడ్డీరేటుకే ఇస్తుందని చెప్పవచ్చు.  

Also Read: Udyogini Scheme: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..ఒక్కొక్కరికీ  రూ. 3లక్షలు..అర్హులు ఎవరంటే?   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Read More