USA Student VISA: సురేష్ ఒక మధ్యతరగతి కి చెందిన యువకుడు. బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. జిఆర్ఈ, టోఫెల్ వంటి కఠినమైన పరీక్షలు పాసై, మంచి స్కోర్ సాధించాడు. దీంతో అమెరికాలోని ఒక ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో సీటు సాధించాడు. ఇంకేముంది తన కల నిజమైంది అనుకున్నాడు. వెంటనే చకచకా వీసా పనులు ప్రారంభించాడు. స్టూడెంట్ వీసా లభించింది. అమెరికా వెళ్లి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కోర్సు నడుస్తోంది. యూనివర్సిటీ దగ్గరలోనే ఒక పార్ట్ టైం జాబ్ కూడా లభించింది. ఇంకేముంది లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడు. కానీ సడన్ గా అతని వీసా రద్దయినట్లు మెసేజ్ వచ్చింది. కాళ్ళ కింద భూమి కనిపించింది.
స్వదేశంలో ఎంతో డబ్బు ఖర్చు చేసుకొని వాళ్ళ నాన్న కూడబెట్టిన కష్టార్జితాన్ని ఖర్చు చేసి మరి అమెరికాకు చేరుకున్నాడు. ఒక్క రెండేళ్లు కష్టపడితే చాలు అప్పులన్నీ తీరిపోయి లైఫ్ లో సెటిల్ అయిపోతాను అనుకున్నాడు. కానీ ఇంతలోనే వీసా ఎందుకు రద్దయింది అని ఆందోళన చెందాడు. ఇంతలో అతను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల వీసా రద్దయినట్లు తెలుసుకున్నాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కారు నడపడంతో ఈ సమస్య ఎదురైనట్లు గుర్తించాడు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో భారతీయ విద్యార్థుల వీసాలు రద్దు అవుతున్నాయి. ఏ ఏ సందర్భాల్లో భారతీయ విద్యార్థుల వీసాలు రద్దు అవుతాయో తెలుసుకుందాం. అమెరికాలో చదివే విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల వీసా రద్దు కావడానికి దారి తీసే ఐదు ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ట్రాఫిక్ నిబంధనలు పాటించకోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు.
1. పూర్తి స్థాయి కోర్సులో నమోదు కాకపోవడం:
ఎఫ్ 1 వీసా నిబంధనల ప్రకారం..విద్యార్థులు ప్రతి సెమిస్టర్ లోనూ పూర్తి స్థాయి కోర్సులో నమోదు కావలి. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సాధారణంగా12 క్రెడిట్స్, గ్రాడ్యుయేట్ విద్యార్థులు అయితే 9 క్రెడిట్స్ తీసుకోవాలి. మీ యూనివర్సిటీలో డీఎస్ఓ నుంచి ముందస్తు పర్మిషన్ లేకుండా ఈ క్రెడిట్ లోడ్ తగ్గితే..అది వీసా రూల్స్ ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. దీని వల్ల మీ SEVIS రికార్డు క్యాన్సల్ అవుతుంది. ఇది వీసా రద్దు అయ్యేందుకు కారణం అవుతుంది.
2. అనధికారిక ఉద్యోగం:
ఎఫ్-1 వీసా కలిగి ఉన్న విద్యార్థులు క్యాంపస్ వెలుపల పని చేయడానికి CPT (Curricular Practical Training) లేదా OPT (Optional Practical Training) వంటి అనుమతులు లేకుండా ఉద్యోగం చేయరాదు. అలా చేస్తే వీసా క్యాన్సిల్ అవుతుంది. అంతేకాదు క్యాంపస్‌లో కూడా వారానికి 20 గంటల కంటే ఎక్కువ పని చేయడం కూడా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తారు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల వీసా రద్దవ్వడంతోపాటు భవిష్యత్తులో మీరు అమెరికా వెళ్లే ఛాన్స్ కూడా కోల్పోతారు.
3. తరగతులకు సరిగా హాజరు కాకపోవడం లేదా డ్రాప్ అవుట్ అవ్వడం:
చాలా మంది విద్యార్థులు తరగతులకు బంక్ కొడుతుంటారు. ఇలా హాజరు సరిగ్గా లేకుంటే మీ స్టూడెంట్ స్టేటస్ ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఇలాంటి చర్యలు వీసా రద్దు అయ్యేందుకు దారి తీస్తాయి.
4. నేర కార్యకలాపాలు లేదా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు :
డ్రంక్ అండ్ డ్రైవ్, షాప్‌లిఫ్టింగ్ వంటి నేరాలతోపాటుగా..ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వంటి చిన్నపాటి నేరాలు కూడా వీసా రద్దుకు కారణం అవుతాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తారు.
5. SEVIS రూల్స్ పాటించకపోవడం:
అమెరికాలోని విద్యార్థులు SEVIS కంట్రోల్లో ఉంటారు. మీ యూనివర్సిటీని మార్చినప్పుడు SEVIS రికార్డులను సకాలంలో అప్ డేట్ చేయకపోవడం లేదా మీ అడ్రస్ మారిన 10 రోజులలోపు మీ యూనివర్సిటీలోని అంతర్జాతీయ విద్యార్థుల కార్యాలయానికి (ISS/ISSS) తెలియజేయకపోవడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. మీ I-20 ఫారమ్‌లో పేర్కొన్న ప్రోగ్రామ్ ముగింపు తేదీలోపు మీ కోర్సును పూర్తి చేయలేకపోవడం, గడువు ముగియకముందే ప్రోగ్రామ్ పొడిగింపు కోసం మీ DSOకి దరఖాస్తు చేసుకోకపోవడం కూడా వీసా రద్దుకు కారణం అవుతాయి.
ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే భారతీయ విద్యార్థులు అమెరికాలో తమ వీసా స్టేటస్‌ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించవచ్చు. అంతేకాదు పై విషయాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే.. మీ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ స్డూడెంట్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook