Home> వినోదం
Advertisement

Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ..


Anchor Vishnu Priya: అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు సెలబ్రిటీలపై పోలీసులు కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కేసులో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

 Vishnu Priya: బెట్టింగ్ యాప్స్  కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ..

Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఉన్న విష్ణు ప్రియ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. బెట్టింగ్ యాప్స్  కేసులో తనపై నమోదైన రెండు FIRలను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.  యాంకర్ విష్ణుప్రియ తెలుగులో టాప్ యాంకర్ గా సత్తా చాటుతోంది.

బెట్టింగ్ అప్స్ ప్రమోషన్స్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరుకానున్న విష్ణు ప్రియ, రీతు చౌదరి. ఇప్పటికే ఈ కేసులో విష్ణుప్రియను విచారించిన పోలీసులు ఈ రోజు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును  కొట్టివేయడంతో పాటు.. అరెస్ట్ చేయకుండా.. ఆదేశాలు జారీ చేయాలని కోరిన విష్ణుప్రియ. ఒకే కేసులో తనపై రెండు కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం తర్వాత ఈమె పోలీసు విచారణకు హాజరు కానున్నారు.

యాంకర్ విష్ణు ప్రియ టాలీవుడ్ తో పాటు టీవీల్లో గ్లామర్ తో మాయ చేస్తోంది. ఎప్పటికపుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తనకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తూ ఆడియన్స్ కు చేరువైంది. అంతేకాదు ఇన్ స్టాలో హాట్ ఫోటో షూట్స్ తో ఎక్కువ పేరు సంపాదించుకుంి.  

విష్ణుప్రియా .. ‘పోవే పోరా’ ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన విష్ణుప్రియ ముందుగా మోడలింగ్ చేసింది. అలా స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. హాట్ ఫిగర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం విష్ణు ప్రియ సొంతం. ఈమె 2005లో మలయాళ సినిమా ‘మయూఖం’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు షార్ట్ ఫిల్మ్ లు, యూట్యూబ్ వీడియోలు, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం ఈమెను సంప్రదిస్తే.. ఈమె  ఈ యాడ్స్ చేసింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియకు భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు తెలుస్తోంది. అది వైట్ గా ఇచ్చారా.. హవాలా రూపంలో అనేది తెలియాల్సి ఉంది.

విష్ణుప్రియా.. భీమినేని 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో జన్మించింది. ముందుగా కథానాయికగా మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె.. ఆపై తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ ‘శివప్పతిగారం’ పరిచయమైంది. అయినా.. పెద్దగా ఆశించిన ప్రయోజనం దక్కలేదనే చెప్పాలి.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More