Bahubali@10Years: చిన్న చిన్న చినుకులు తుపానుగా మారినట్టు తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా అనే కంటే భారతీయ సినిమాకు ప్యాన్ ఇండియా మార్కెట్ కు ద్వారాలు తెరిచింది. ముందుగా ఈ సినిమాను ఒకే భాగంగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తీరా నిడివి ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయడం అనే కాన్సెప్ట్ కు పునాది వేస్తే.. రాజమౌళి దానికి మరింత ముందుకు తీసుకెళ్లారు. ఒక చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే సంప్రదాయం ‘బాహుబలి’తో జోరందుకుంది. బాహుబలి కోసం ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువ భాగాన్ని కేటాయించాడు. దాని ఫలితం కూడా ప్రభాస్‌కు ఓ రేంజ్ లో దక్కింది. ప్రస్తుతం మన దేశంలో తెలుగుతో పాటు హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు బాహుబలితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా హిందీలో తొలి వంద కోట్లకు నెట్ వసూళ్లను సాధించిన తొలి డబ్బింగ్ మూవీగా రికార్డు నెలకొల్పింది.
బాలీవుడ్ మార్కెట్ పై ఓ తెలుగు సినిమా ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది అదే మొదలు. ఈ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమాను సగం మాత్రమే ఉండటంతో తొలి రోజు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. సగం చిత్రమే చూపించడాని విమర్శలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు.. క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సస్పెన్స్ తో సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. దానికి ప్రభాస్, రానాల కటౌట్ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా బాహుబలి అంటే అత్యంత బలవంతుడు అని అర్ధం. దానికి ప్రభాస్ వంద శాతం న్యాయం చేశాడు.
ఈ సినిమా పదేళ్ల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.4 కోట్ల షేర్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రూ. 46 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా రూ. 73 కోట్ల గ్రాస్ వసూళ్లతో అప్పటి వరకు ఎన్నో సినిమాల లైఫ్ టైమ్ లో సాధించని వసూళ్లను మొదటి రోజే రాబట్టి బాక్సాఫీస్ ట్రేడ్ పండితులును ఆశ్చర్యపోయేలా చేింది. ఈ సినిమా మొత్తం రన్ లో తెలంగాణలో రూ. 43 కోట్ల షేర్ .. రాయలసీమలో రూ. 21.8 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా తెలుగు స్టేట్స్ లో రూ. 114 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 194 కోట్లను కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రాబట్టింది. ఇక హిందీ ఇతర భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 304 కోట్ల షేర్ (రూ. 605 కోట్ల గ్రాస్) వసూళ్లను అందుకొని సెన్సెషనల్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో ఓ సినిమా వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అనేది ఈ సినిమాతోనే మొదలైంది. ఓవరాల్ గా మొత్తం రన్ లో రూ. 186 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు లాభాలను అందుకొని చరిత్రలో నిలిచిపోయింది.
పైగా తెలుగులోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమా బిజినెస్ పై ఈ రేంజ్ ప్రాఫిట్స్ అందుకున్న సినిమా మరేది లేదు. ఆ రకంగా సినిమా బిజినెస్ పై దాదాపు రూ. 200 కోట్ల లాభాలను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా పలు రికార్డులను తిరగరాసింది. బాహుబలి అనే తెలుగు సినిమాతో కథ బాగుంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో రఫ్పాడించవచ్చనే విషయాన్ని బాహుబలి సినిమా ప్రూవ్ చేసింది. బాహుబలి తర్వాత విడుదలైన బాహుబలి 2 తెలుగు సినిమాల్లోనే భారతీయ చిత్ర పరిశ్రమలో పలు రికార్డులను సెట్ చేసింది. ఇప్పటికే కొన్ని రికార్డులను బద్దలు కొట్టడం అంత ఈజీ కాదనే చెప్పాలి.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.