Home> వినోదం
Advertisement

Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై ఈడీ దూకుడు.. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీలపై కేసు..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన నటీనటులపై కేసులు నమోదు చేసింది.   

Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై ఈడీ దూకుడు.. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీలపై కేసు..

Betting Apps: తమకున్న సెలబ్రిటీ హోదాతో ప్రస్తుతం కొంత మంది సెలబ్రిటీలు కాసుల కోసం దేన్ని పడితే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలా కొంత మంది సెలబ్రిటీ హోదా ఉన్న బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రజలను మిస్ గైడ్ చేస్తున్నారు. తప్పని తెలిసినా.. అడిగినంత డబ్బులను ఆయా బెట్టింగ్ యాప్స్  వీళ్లకు ఇస్తుండటంతో విచక్షణ మరిచి వీటిని ప్రమోట్ చేసారు. దానికి సంబంధించిన ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యప్స్ ప్రమోట్ చేశారంటూ రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా దాదాపు 21 మంది పై ఈడీ కేసులు నమోదు చేసింది. అటు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజు పేరుంది. అటు సినీ నటి ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ళ, శ్రీ హనుమంతు, శ్రీముఖి, నైని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, వర్షిణి సౌందర్రాజన్,వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి,ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరికీ తాజాగా ఈడి నోటీసులు జారీ చేసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు ప్రమోట్ చేశారు. వారి నుంచి వీరికి ఎంత మొత్తంలో అందింది. వీరు తెలియక చేసారా.. డబ్బుల కోసం చేసారనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. వీరిపై పీఎంఎల్ఏ కింద విచారించనుంది. 

ఇక నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో టీవీ యాంకర్లు.. టీవీ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిందరిపై భారతీయ న్యాయ సంహితలోని 318 (4), తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3, 3 (A), 4 సెక్షన్లతో పాటు ఐటీ చట్ట పరిధితో 2000, 2008లోని 66 డి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టనుంది. 

ఆయా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోమని చెప్పడంతో పాటు ఈ యాప్స్ ద్వారా కోటీశ్వరులు కావొచ్చని ప్రచారం చేసారు. దీంతో చాలా మంది దిగువ, మధ్య తరగతి అనే వారే కాకుండా.. ఎక్కువ మంది యువతీ యువకులు వీళ్ల ప్రమోషన్ల కు ఆకర్షితులై అందులో  బెట్టింగ్ కట్టి సర్వస్వం కోల్పోయిన వారున్నారు. వారి కుటుంబంలో ఆర్ధిక  సంక్షోభానికి కారణమైనట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

Also Read :పెళ్లి తర్వాత కూడా ఆ తెలుగు స్టార్ హీరోయిన్ తో కొనసాగిన గంగూలి ఎఫైర్ .. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన స్టార్ క్రికెటర్ లవ్వాయణం..

Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More