Kannappa bookings: మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాసరా ఎంటర్టైన్మెంట్ కన్నప్ప చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే థియేటర్స్ లిస్ట్ కూడా ప్రకటించారు. ఇప్పటికే ఓవర్సీస్ లో 200 పైగా ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు. అక్కడ అమెరికా ఇతరత్రా అన్ని కలిపి 1,100 పైగా స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి దాదాపు 4,300 స్క్రీన్స్ లలో ‘కన్నప్ప’ భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ప్రభాస్ క్యామియో పెద్ద ఎస్సెట్ గా నిలబోతుంది. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ ఈ చిత్రంలో మహా శివుడిగా పాత్రలో నటించారు. ప్రభాస్ రుద్ర పాత్ర కన్నప్ప చిత్రంలో హైలెట్ గా నిలవనుంది. ఇప్పటికే ట్రైలర్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ‘కిరాతక’ పాత్రలో కనిపించనున్నాడు.
మొత్తంగా కెమియో రోల్స్ లో ఆయా భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటించడంతో కన్పప్ప మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 5400 స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. మంచు విష్ణు కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాదు మంచు విష్ణు కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా పౌరాణిక , చారిత్రక చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ సినిమాలో మంచు మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో కథకు కీలకమైన క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నారు. IMAX, స్క్రీన్ X మరియు 4DX వెర్షన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఫ్యాక్టర్ హిందీ, మలయాళ భాషల్లో ఇంపాక్ట్ చూపెట్టే అవకాశాలున్నాయి.
ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు,మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత వేటా విజువల్స్, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ హైలెట్స్ కానున్నాయి. ప్రేక్షకులు కన్నప్ప మూవీని బుక్ మై షో, పేటీఎం మూవీస్, ఫాండంగో, ఆటమ్ టికెట్స్ వంటి వాటిల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.