Kannappa movie Plus Points: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు ఈ సినిమాలో కీలకమైన మహదేవ శాస్త్రి పాత్రలో నటిస్తూ భారీ ఎత్తున నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడి క్యారక్టర్‌లో గంబీరమైన వాయిస్‌తో మెప్పించారు. తిన్నడు తండ్రి పాత్రలో ఒద్దికగా ఒదిగిపోయాడు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మహాదేవ శాస్త్రిగా జీవించేశారు హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. అంతేకాదు కాస్త ఎక్స్ పోజింగ్ మైనస్.
ఇక కిరాతక వేషంలో మోహన్ లాల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అర్జునుడితో కిరాతకుడి పోరాటం కిరాతార్జునీయం ఎపిపోడ్ సినిమాకు మరో పిల్లర్ లా నిలిచింది. ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్ రోల్ గురించి.. సినిమాలో కీలకమైన అర గంటకు పైగా ఎపిసోడ్‌ను ప్రభాస్ నిలబెట్టేశాడు. శివుడి అంశ అయిన రుద్ర పాత్రలో కథలో కీలకంగా నిలిచాడు. తిన్నడు భక్తుడిగా మారడంలో ప్రభాస్ పాత్రే కీలకం అని చెప్పాలి.
ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ పెన్నుకు పదును పెట్టాడు. ప్రభాస్ పెళ్లి డైలాగ్‌కు థియేటర్స్ హోరెత్తాయి. నీకు పెళ్లైందా అని మంచు విష్ణు క్యారెక్టర్ అడగటం.. అది అవసరమా అని ప్రభాస్ చెప్పే డైలాగ్ కు థియేటర్స్ లో విజిల్స్ పడతాయి. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఈ సీన్ సినిమా సక్సెస్ లో కీ రూల్ పోషించింది. ఇక క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటన కెరీర్ బెస్ట్ అనే టాక్ వినిపించింది. శివయ్యకు తన కన్నులను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. అటు అక్షయ్ కుమార్ శివుడి పాత్ర మన తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకు చూసినట్టుగా కాకుండా.. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దినట్టు ఉంది. అదొక్కటే తెలుగు ప్రేక్షకులకు మైనస్ గా కనిపిస్తోంది. ఈ సినిమా కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో నిర్మించిన మోహన్ బాబు, విష్ణు ను మెచ్చుకుని తీరాలి. సాంగ్స్ తో పాటు నేపధ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.