Home> వినోదం
Advertisement

Kannappa Movie Review: ‘కన్నప్ప’మూవీ రివ్యూ.. మంచు విష్ణు హిట్టు అందుకున్నట్టేనా..!

Kannappa Movie Review: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్పప్ప’. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు. ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. మంచు విష్ణుతో పాటు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటించారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం. 

Kannappa Movie Review: ‘కన్నప్ప’మూవీ రివ్యూ.. మంచు విష్ణు హిట్టు అందుకున్నట్టేనా..!

మూవీ రివ్యూ: కన్నప్ప (Kannappa)
నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ముఖేష్ ఋషి, శివ బాలాజీ, కౌశల్ మంద, బ్రహ్మానందం, సప్తగిరి, మాస్టర్ అవ్రామ్ భక్త తదితరులు
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ 
సినిమాటోగ్రఫీ: షెల్డాన్ చావ్
ఎడిటర్: ఆంటోని 
బ్యానర్ అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత: మోహన్ బాబు 
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్ 
విడుదల తేది: 27-6-2025

తెలుగులో కన్నప్ప జీవిత చరిత్రపై ‘శ్రీకాళహస్తి మహత్యంతో పాటు భక్త కన్నప్ప చిత్రాలొచ్చాయి. ఆయా పాత్రల్లో లెజండరీ నటులు డాక్టర్ రాజ్ కుమార్, కృష్ణంరాజు వంటి లెజండరీ నటులు మెప్పించారు. దాదాపు అర్ధ శతాబ్ధం తర్వాత ఇదే కథతో మంచు విష్ణు ‘కన్నప్ప’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దాదాపు ఈ సినిమా కోసం 2014 నుంచి రీసెర్చి చేసి ఎట్టకేలకు  విడుదల చేసాడు. దాదాపు పదకొండేళ్లు ఈ సినిమా కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాతో మంచు విష్ణు తాను కోరుకున్న సక్సెస్ ను అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. 

కథ విషయానికొస్తే.. 
పార్వతీ పరమేశ్వరులు (అక్షయ్, కాజల్) కైలాసంలో కన్నప్ప గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది.  మహా భారత యుద్ధం తర్వాత అర్జునుడు  మోక్షం పొందక తిన్నడు (మంచు విష్ణు)గా ఓ గూడెంలో మరో జన్మ ఎత్తుతాడు. పుట్టినప్పటి నుంచి నాస్తికుడైన తిన్నడు ఎలా శివ భక్తుడిగా మారాడు. అందుకు పరమేశ్వరుడు (అక్షయ్ కుమార్)  అతని జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు. అలా నాస్తికుడు నుంచి ఆస్తికుడిగా మారిన తిన్నడు.. ఆ పరమేశ్వరుడికి తన రెండు కళ్లనే నైవేద్యంగా ఇచ్చి కన్నప్పగా ఎలా మారాడు. ఈ క్రమంలో తిన్నడు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యలో తిన్నడును భక్తుడిగా మార్చడంలో రుద్ర (ప్రభాస్) పాత్ర, మహదేవ శాస్త్రి (మోహన్ బాబు), కిరాతక ( మోహన్ లాల్) ఎలా దోహదం చేసారనేదే  కన్నప్ప స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

కన్నప్ప స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కానీ ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసమే మంచు విష్ణు ఈ భారీ ప్రాజెక్ట్ ను తన భుజాలపై వేసుకున్నాడు. దాన్ని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ను మెచ్చుకోవాల్సిందే. కన్నప్పకు సంబంధించిన స్కెచెస్ తో పాటు పాత సినిమాల్లో లేనట్టుగా ఈ చిత్రంలో శ్రీకాళహస్తికి సంబంధించిన వాయులింగం కోసం గిరిజన తెగలు ఎలా పోరాటం చేసుకున్నాయనే ఎపిసోడ్ ను థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం పెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ చోప్రా తర్వాత మహాభారతం వంటి భారీ సీరియల్ తీసిన అనుభవం కన్నప్పను తెరకెక్కించడానికి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కన్నప్ప నాస్తికుడి గా ఎంత మొరటుగా ఉండేవాడనేది చూపించాడు. ఇంటర్వెల్ కు ముందు మోహన్ లాల్ కిరాత పాత్రతో కిరాతార్జునీయం ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. తిన్నడిని ఆస్తికుడిగా మార్చడంలో రుద్ర పాత్రలో ప్రభాస్ రోల్ ఈ సినిమాకు కీలకం అని చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత దాదాపు అరగంట వరకు ఉన్న ప్రభాస్ రోల్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. 

శివుడిగా అక్షయ కుమార్, పార్వతి మాత పాత్రలో కాజల్ అగర్వాల్ పాత్రలు మన తెలుగు సినిమాల మాదిరి కాకుండా హిందీ సీరియల్స్ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ టేస్టకు   తగ్గట్టు వాళ్ల ఆహార్యాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు ను ఎంచుకోవడం మంచి సెలక్షన్.  సినిమాలో ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులు భక్తిలో లీనమయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాత కన్నప్ప చిత్రాలు చూసిన వాళ్లకు కొంత మేర నచ్చకపోవచ్చు. హీరోయిన్ కు ఇతర లేడీస్ పాత్రలకు బట్టల విషయంలో బాగా పొదుపుగా వాడినట్టు అనిపిస్తుంది. అదేక్కటే కాస్త మైనస్ అని చెప్పాలి.  దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తనదైన శైలిలో మెప్పించాడు. నిర్మాణ విలువలు గ్రాండియర్ గా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల తప్పించి ఓవరాల్ గా బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా రొటిన్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మనకు ‘కన్పప్ప’ సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటి తరం తప్పక చూడాల్సిన ఓ భక్తుడి కథ కన్నప్ప.

నటీనటుల విషయానికొస్తే.. 
కన్నప్పగా టైటిల్ రోల్ కు మంచు విష్ణు తన పాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి. ఎంతో రిస్క్ తో కూడుకున్న క్యారెక్టర్ ను చేయడం కత్తి మీద సామే. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాల్లో తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఈ సినిమాలో రుద్రగా ప్రభాస్ ఉన్నది కాసేపు అయినా.. సినిమాకు పెద్ద సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. కిరాతక పాత్రలో మోహన్ లాల్ కిరాతార్జునీయం ఎపిసోడ్ లో తన యాక్టింగ్ తో ఇరగదీసాడు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పార్వతి పరమేశ్వరులుగా  ఓ మోస్తరుగా మెప్పించారు. ఈ చిత్రంలో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు పాత్ర స్టడీగా బాగుంది.  ఈ చిత్రంలో విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త బాల నటుడి ఈ సినిమాలో చిన్నప్పటి తిన్నడి పాత్రలో నటించాడు. అతని డైలాగుల్లో ఇంగ్లీష్ స్లాంగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  ఈ పాత్ర చూస్తుంటే మంచు మనోజ్ ను గుర్తుకు తెచ్చాడు. శ్రీకాళహస్తి మహత్యం పాటలో అరియాన, వివియనా కనిపించడం విశేషం. మరో చిన్నపాప కూడా సినిమాలో ఓ సన్నివేశంలో కనిపిస్తోంది.  శరత్ కుమార్ తిన్నడి తండ్రి నాథనాథుడిగా పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలో కూరలోకరివేసాకు టైపులో ఉంది. ఎందుకున్నాయో తెలియదు.  ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. 

ప్లస్ పాయింట్స్ 

కన్నప్ప కథ

ప్రభాస్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరియన్స్ 

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ 

నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ 

ఫస్ట్ హాఫ్ లో కొంత భాగం 

హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ 

పంచ్ లైన్.. ఈ తరం తప్పక చూడాల్సిన భక్తుడి కథ ‘కన్పప్ప’.. 

రేటింగ్: 3/5

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More