Kannappa Weekend Collections: కెరీర్ లో ‘ఢీ’, ‘దేవికైనా రెఢీ’ వంటి కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన మంచు విష్ణు హిట్ అందుకుని దాదాపు ఎన్నో యేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈయన ఎన్నో ఏళ్ల కలల ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని నిర్మించడమే కాదు. హీరోగా నటించారు. అంతేకాదు ఈ సినిమాలో మంచు విష్ణు వాచకం పరంగా.. నటన పరంగా ఎంతో ఇంప్రూమెంట్ కనిపించింది. క్లైమాక్స్ లో అతని కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. విమర్శకులు కూడా మంచు విష్ణు నటనను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రీ క్లైమాక్స్ లో రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.
ప్రభాస్ ఉన్న దాదాపు అరగంట ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమాలో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాలు, ప్రీతి ముకుందన్ ల మధ్య సీన్స్ ఆడియన్స్ కు బూస్ట్ ఇచ్చాయి. అంతేకాదు రుద్రగా ప్రభాస్ ఈ సినిమాను కాపాడడనే చెప్పాలి. మొత్తంగా కన్నప్పకు రుద్ర పాత్ర ఎంతో పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. అది వసూళ్ల రూపంలో కనిపించింది. మొత్తంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8 కోట్ల షేర్.. (రూ. 16 కోట్ల గ్రాస్) అందుకుంది. మంచు విష్ణు గత సినిమా జిన్నా మొదటి రోజు కేలం రూ. 30 లక్షలు మాత్రమే రాబట్టి నెగిటివ్ షేర్ అందుకున్న చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
అలాంటి సినిమా తర్వాత ‘కన్నప్ప’తో ఎపిక్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ. 20 కోట్ల షేర్ (రూ. 37 కోట్ల గ్రాస్) వసూళ్లను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సాధించిన రూ. 20 కోట్ల షేర్ మార్క్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 60 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫస్ట్ వీకెంట్ పూర్తైయిన తర్వాత అసలు సిసలు పరీక్ష ఈ రోజు నుంచి కన్నప్పకు మొదలైంది. మరి సోమవారం పరీక్షను ఈ సినిమాను తట్టుకొని ఏ మేరకు కలెక్షన్స్ ను రాబడుతుందనేది చూడాలి. మొత్తంగా మంచు విష్ణు గత చిత్రాలను చూసుకుంటే ‘కన్నప్ప’ చిత్రం ఈయన కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.