Nidhi agarwal promoting betting app video: హైదరబాద్ పోలీసులు ఇటీవల బెట్టింగ్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 11 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లు, సెలబ్రీటీలపై కేసుల్ని సైతం నమోదు చేశారు. మొత్తంగా బెట్టింగ్ యాప్ అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిలో.. విష్ణు ప్రియ, సుప్రీత, రీతూ చౌదరీ, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ , కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, బండారు పేషయానీ తదితరులపై పంజాగుట్ట పొలీసులు కేసుల్ని నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా.. నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. JeetWin అనే బెట్టింగ్ యాప్ ను నిధి అగర్వాల్ ప్రమోట్ చేస్తు ఒక వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఇది వైరల్ కావడంతో ఆమెపై వెంటనే చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్ లపై, వాటిని ప్రమోట్ చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నిధి అగర్వాల్ వీడియో బైటకు రావడం హట్ టాపిక్ గా మారింది.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా ఝళిపిస్తున్న నైపథ్యంలో తెరపైకి మరో హీరోయిన్
JeetWin అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్.. తనపై చర్యలు తీసుకోవాలని @SajjanarVC గారిని కోరుతున్న… https://t.co/1y4xitlUuj pic.twitter.com/ZZY75flc31
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025
ఈ క్రమంలో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తొంది. మరోవైపు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారంత.. వరుస పెట్టి మరీ సారీలు చెబుతూ.. బెట్టింగ్ యాప్ లను తెలియకుండా ప్రమోట్ చేశామని.. దయచేసి వీటిని ఎవరు ఫాలో అవ్వకండని చెబుతూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు.
Read more: Tamannaah Bhatia : తెరపైన ఆ హీరోయిన్ రోల్ చేయాలనుంది.. మనసులో మాట బైటపెట్టిన తమన్న..
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. తెలిసి చేసిన, తెలియక చేసిన కూడా తప్పుతప్పే కాబట్టి.. బెట్టింగ్ యాప్ లపై లను ప్రమోట్ చేసిన వారిపై కేసుల్ని నమోదు చేశారు. అంతేకాకుండా.. వీరిపై తదుపరి చర్యలకు కూడా పోలీసులు రంగం సిద్దం చేశారు. ఈ క్రమంలో నిధి అగర్వాల్ వీడియో మాత్రం నెట్టింట మరోసారి వివాదానికి దారితీసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter