‘మొగలి రేకులు’ సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. ఆ తర్వాత ఒకటి అర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సారి ‘ది 100’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
నగరి ఓ బందిపోటు ముఠా వరుస హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇదే క్రమంలో అపుడే శిక్షణ పూర్తి చేసుకున్న విక్రాంత్ (సాగర్) ఏసీపీగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అంతేకాదు ఈ కేసును ఛాలెంజ్ గా స్వీకరిస్తాడు. ఈ క్రమంలో ఈ దోపిడి ముఠా చేతిలో తను ఎంతగానో ప్రేమించే ఆర్తి (మిషా నారంగ్) లైంగిక దాడికి గురవుతుంది. దీంతో ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు. ఇంతకీ ఈ ముఠా ఎవరు.. ? వీరి పట్టుకోవడానికి విక్రాంత్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు.. ? ఆ దోపిడి ముఠాను చిరవకు ఎలా పట్టుకున్నాడు.. ? ఇక తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి న్యాయం చేసాడా.. ? చివరకు ఏమైంది.. ? 100 టైటిల్ కు ఈ కథకు సంబంధం ఏమిటన్నదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు సహా భారతీయ భాషల్లో ఇలాంటి ఇన్వెష్టిగేషన్ కథలు చాలానే వచ్చాయి. అవన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ఈ కోవలో వచ్చిన చిత్రమే ‘ది 100’. ఇలాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లేనే ప్రాణం అని చెప్పాలి. దర్శకుడు ఓంకార్ శశిధర్ ఈ సినిమాకు మంచి దోపిడీ ముఠా కథ రాసుకోవడం. సమాజాన్ని అల్లకల్లోలం చేస్తోన్న వారు.. హీరోయిన్ పై లైంగిక దాడి చేయడంతో ఆ రాబరీ ముఠా వల్ల హీరోను బాధితుడిగా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ రకంగా ఈ కేసును హీరో పర్సనల్ గా తీసుకొని చేధించడం వంటివి రొటీన్ ఫార్ములా అయినా.. ఈ సినిమాలో దర్శకుడు కన్విన్సింగ్ చెప్పడం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉండటంతో ఈ సినిమాను ఎక్కడా ల్యాగ్ కాకుండా రపా రపా అంటూ సినిమా స్క్రీన్ ప్లేను పరుగులు పెట్టించాడు. ఫస్టాఫ్ లో కాస్త తడిబడినట్టు కనిపిస్తోంది. స్క్రీన్ ప్లే, డైలాగులు వంటివి బాగున్నాయి.
కొన్ని సీన్స్ రొటిన్ గా అనిపించినా.. సరికొత్తగా ప్రెజెంట్ చేయడం వల్ల ఈ సినిమా ఫ్రెష్ గా కనిపిస్తోంది. సినిమా రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించాడు. హీరో అన్నకా.. తోపు, తురుము అని కాకుండా.. అతను ఓ కామన్ వ్యక్తే అన్న పాయింట్ ను ఈ సినిమాలో చూపించాడు. హీరో కూడా విలన్ల వల్ల కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయడం వంటివి రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమా టెంపో ను కంటిన్యూను చేయడంలో సహాయ పడ్డాడు. ఇతను ఇచ్చిన పాటలు సినిమా చూసే ప్రేక్షకులకు పంటి కింద రాయిలా కాస్త ఇబ్బంది పెడతాయి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. చీకటి నైట్ విజువల్స్ బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
ఆర్కే సాగర్ మొగలి రేకులు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతని నటన బాగుంది. ఎక్కడా తడబాటు లేదు. సీరియల్స్ లో నటించిన అనుభవంతో ఇతను కొత్త హీరో అన్న ఫీలింగ్ రాకుండా తెరపై మంచి ఈజ్ తో నటించాడు.‘ది 100’ మూవీ సాగర్ కెరీర్ లో సరికొత్త మైల్ స్టోన్ గా నిలవడం పక్కా అని చెప్పొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. కొన్ని సీన్స్ లో మంచి ఎమోషన్స్ పండించాడు. హీరోయిన్ గా నటించిన మిషా నారంగ్ నటన పర్వాలేదు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు ఓ మోస్తరుగా నటించారు.
ప్లస్ పాయింట్స్
కథ
సాగర్ నటన
క్లైమాక్స్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
పాటలు
అక్కడక్కడ లాజిక్ కు అందని సీన్స్
‘పంచ్ లైన్’.. ‘ది 100’ ..ఆకట్టుకునే పోలీస్ యాక్షన్ డ్రామా..
రేటింగ్: 3/5
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.