Home> హెల్త్
Advertisement

Weight Free Biryani: బిర్యానీ ఇలా ఎన్నిసార్లు తిన్నా బరువు పెరగరు.. ఎలానో తెలుసా?

Weight Free Biryani If You Eat No Gain Of Weight: బరువు తగ్గాలనుకునేవారు తమకు ఎంతో ఇష్టమైన బిర్యానీకి దూరంగా ఉంటారు. కానీ బిర్యానీపై ఎందుకు మమకారం చంపుకోవాలి? బరువు పెరగకుండా బిర్యానీ చేసుకుంటే చాలు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Weight Free Biryani: బిర్యానీ ఇలా ఎన్నిసార్లు తిన్నా బరువు పెరగరు.. ఎలానో తెలుసా?

Eat Biryani No Gain Weight: అధిక బరువుతో బాధపడుతున్న వారు ఏమి తిన్నా బరువు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతుంటారు. దీంతో జిహ్వా నాలుకను చంపుకుని ఆహార నియమాలు పాటిస్తారు. ఈ క్రమంలో తమకు ఎంతో ఇష్టమైన కమ్మటి బిర్యానీని తినకుండా ఉంటారు. బిర్యానీ తింటే అధికంగా కొవ్వు పదార్థాలు చేరుతాయనే భయంతో బిర్యానీకి దూరం ఉంటారు. కానీ ఇకపై అలా ఉండనవసరం లేదు. బిర్యానీ తిన్నా కూడా బరువు పెరగరు. అలాంటి అద్భుతమైన బిర్యానీ ఏమిటో తెలుసా?

Also Read: Salary Hike: భారత్‌లో అత్యధికంగా జీతం పొందుతున్నది ఎవరో తెలుసా? వారి జీతాల వివరాలు ఇవే!

బయట హోటళ్లలో బిర్యానీ తింటే మాత్రం బరువు తప్పకుండా పెరుగుతారు. అందుకే ఇంట్లోనే బిర్యానీని చేసుకుంటే మేలు. అయితే బిర్యానీ చేసుకునే విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

బ్రౌన్‌ రైస్‌తో బిర్యానీ
సాధారణంగా బిర్యానీ బాస్మతి బియ్యంతో చేస్తారు. ఆ బియ్యంలో అధికంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. బాస్మతీ బియ్యం బదులు బిర్యానీ బ్రౌన్‌రైస్‌ లేదా చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి బ్రౌన్‌రైస్‌ ఎంతో ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. బ్రౌన్‌రైస్‌లో అధికంగా ఫైబర్‌ ఉంటుంది. బ్రౌన్‌ రైస్‌ అధికంగా తినలేం. కొంచెం తిన్నా కడుపు నిండిందనే భావన వస్తుంది. రుచికరంగా బ్రౌన్‌రైస్‌తో బిర్యానీ చేసుకుని తినవచ్చు. ఇలా తింటే బరువు ఏమాత్రం పెరగరు.

Also Read: Telangana Rains: రేపు, ఎల్లుండి భద్రం.. పొంచి ఉన్న భారీ వర్షాలు

అరికలతో బిర్యానీ
బరువును నియంత్రించే తృణధాన్యాల్లో అరికలు (ఇంగ్లీష్‌లో కుడో మిల్లెట్‌) కీలక పాత్ర పోషిస్తాయి. బాస్మతీ బియ్యం స్థానంలో అరికలు వేసి బిర్యానీ చేసుకుంటే మంచిది. దీనివలన బరువు పెరగడం అనే సమస్య ఉండదు.

ఇవి తగ్గించాలి
బిర్యానీ తినాలనుకుంటే ఆ తయారీ విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. బిర్యానీలో  ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, బీన్స్, బఠాణీలు, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటివి చేరిస్తే అవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. పోషకాలతో నిండి ఉన్న కూరగాయలతో బిర్యానీ తింటే తక్కువ కేలరీలు శరీరంలోకి వెళ్తాయి. దీనివలన బరువు పెరగరు.

మరికొన్ని జాగ్రత్తలు
==> చికెన్‌ బిర్యానీ తినాలనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్కిన్‌లెస్‌ చికెన్‌ను ఉపయోగించి బిర్యానీ చేసుకోవాలి.
==> పన్నీర్‌ బిర్యానీ తినాలనుకునే వారు వాటి స్థానంలో సోయా ముక్కలను చేర్చుకుంటే మంచిది.
==> ఏ బిర్యానీ చేసుకున్నా కూడా మసాలాలు తక్కువగా వాడితే గుండెకు కూడా ఆరోగ్యం. 
==> బిర్యానీ ఎంత రుచికరంగా ఉన్నా కూడా ఎక్కువగా తినరాదు. వారంలో ఒకసారి అంటే పర్లేదు. కానీ వారంలో మూడు రోజులు బిర్యానీ తింటే మీ బరువు పెరుగుదలను నియంత్రించడం ఎవరి వల్ల సాధ్యం కాదు.
==> బిర్యానీ తిన్నా తినకపోయినా బరువు తగ్గాలంటే శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్‌, రన్నింగ్‌ లేదంటే జిమ్‌కు వెళ్తే ప్రయోజనం ఉంటుంది.

గమనిక: పైన తెలిపిన వివరాలు అవగాహన కోసం అందించిన సమాచారం. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. మీ వైద్యుడి సలహాతో బరువు తగ్గుదల పద్ధతులు పాటించండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook  

Read More