Home> హెల్త్
Advertisement

Sugarcane Juice: ఎండ వేడిమికి విరుగుడు చెరుకు రసం.. తాగితే ఏమవుతుందో తెలుసా?

Drink Sugarcane Juice What Happened To Health: వేసవికాలంలో వీలైనంత ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసంతో పాటు చెరుకు రసం తీసుకోవాలి. చెరుకు రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Sugarcane Juice: ఎండ వేడిమికి విరుగుడు చెరుకు రసం.. తాగితే ఏమవుతుందో తెలుసా?

Daily One Glass Sugarcane Juice: కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటి కాగా.. రెండోది చెరుకు రసం (Sugarcane). చెరుకు రసం దాహం తీర్చడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్ని కాలాల్లో చెరుకు రసం లభిస్తుండగా వేసవికాలంలో అధికంగా తాగుతారు. వేసవిలో ఎండ వేడిమి నుంచి చెరుకు రసం ఉపశమనం లభిస్తుంది. అందుకే ఈ కాలంలో చెరుకు రసం విక్రయాలు భారీగా ఉంటాయి. ప్రతిచోట చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా చెరుకు రసం ఉంటుంది. చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.

Also Read: Gym Dos And Donts: జిమ్‌కు ముందు.. జిమ్ తర్వాత చేయాల్సిన పనులు

చెరుకు రసం తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వేడిమి నుంచి ఉపశమనమే కాకుండా జీర్ణక్రియకు.‌. అలసట తీరడం.. పచ్చ కామెర్లు.. వాంతులు నివారణ అవుతాయి.

చెరుకు రసం ప్రయోజనాలు ఇవే..

  • చెరుకు రసం తాగడంతో జీర్ణక్రియ పెరగడంతోపాటు ఎలాంటి వ్యాధులు దరి చేరవని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు తరచూ చెరుకు రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • చెరుకు రసం తాగడంతో అలసట తీరడమే కాకుండా అనారోగ్య సమస్యలు నివారిస్తుంది.
  • రక్తంలో చక్కర శాతం తగ్గి కళ్లు తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు చెరుకు రసం తాగుతే ఉపశమనం పొందవచ్చు. శరీరానికి వెంటనే శక్తి పెరుగుతుంది.
  • ప్రతి నిత్యం గ్లాసు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో అయితే మరింత ఎక్కువ సార్లు తీసుకోవడం ఉత్తమం.
  • చెరుకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే జీర్ణశక్తికి మేలు చేస్తుంది. తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.
  • చెరుకు రసంలో ఉత్తమ పోషకాలు లభిస్తాయి. శరీరానికి కావాల్సిన పోషక శక్తులు చెరుకు రసంలో ఉంటాయి.
  • చెరుకు రసంలో అల్లం కలిపి తాగితే గొంతు గరగర నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి.
  • పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగితే ఎంతో మేలు. కామెర్లను చెరుకు చాలా వరకు నియంత్రణ చేస్తుంది.
  • చెరుకులో విటమిన్ బీ ఉన్నందున దీన్ని సర్వ శ్రేష్టమైన టానిక్ గా చెప్పవచ్చు.
  • వాంతులు జరిగినప్పుడు చెరుకు రసం తాగితే సమస్యల నివారణ అవుతుంది.

Also Read: Pomegranate: దానిమ్మ క్యాన్సర్స్‌కు జేజమ్మ.. క్యాన్సర్ నివారణకు అద్భుత ఔషధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More