Summer Health Tips: వేసవికాలం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. వేసవిలో చర్మం నల్లబడడం.. పొడిబారడం జరుగుతుంది. చెమట, దురద వస్తుంది. ఈ కారణంగా చాలా వేసవిలో చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యల నుంచి సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి స్నానం చేసే ముందు నీటిలో కొన్ని పదార్థాలను కలపాలి. దీనివల్ల చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Also Read: Save HCU Movement: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. 'మమ్మల్ని అభినందించాలి'
చల్లటి నీరు
వేసవిలో శరీరం తేమ కోల్పోతుంది. శరీరం తేమగా ఉంచుకోవడం కోసం వీలైనంత ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకోవాలి. వేడి వలన ఇబ్బందులు పడుతుంటే చల్లటి నీటితో స్నానం చేయాలి. సాధారణ నీటితో కాకుండా చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పడుతుంది.
అల్లం రసం
శరీర నొప్పులు పడుతుంటే అల్లం రసం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు అల్లం రసాన్ని కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒంటి నొప్పులు తగ్గడమే కాకుండా చెమట వాసనను కూడా తగ్గిస్తుంది.
Also Read: HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు
ఆలివ్ నూనె
చర్మాన్ని పొడి బారకుండా ఆలివ్ నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలివ్ నూనెను నీటిలో కలిపి స్నానం చేస్తే ఇది తేమను కాపాడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మొటిమలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.
వేప నీరు
వేప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు చాలా తగ్గుతాయి. కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
రోజ్ వాటర్
శరీరాన్ని చల్లగా ఉంచడానికి.. మంచి సువాసన రావడానికి రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. 4-5 గులాబీ రేకులను మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే మార్కెట్ లో రెడీమేడ్ రోజ్ వాటర్ ఉంటాయి. రోజ్ వాటర్ నీటిలో కలిపి స్నానం చేయవచ్చు.
లావెండర్ ఆయిల్
లావెండర్ ఆయిల్ శరీరానికి మేలు చేస్తుంది. ఈ ఆయిల్ ఒత్తిడిని తగ్గించి చెమట వాసనను దూరం చేస్తుంది. లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు నీటిలో వేసి స్నానం చేయాలి.
పసుపు
పసుపు శరీరానికి మేలు చేస్తుంది. శరీరం శుభ్రం చేయడంలో పసుపు సహాయపడుతుంది. కొద్దిగా పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
గంధం
గంధపు నీటితో కూడా స్నానం చేయవచ్చు. గంధపు నీరు ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కొద్దిగా గంధపు పొడిని లేదా గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయాలి.
తులసి
తులసీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. అనంతరం చల్లారక ఆ నీటితో స్నానం చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.