Home> హెల్త్
Advertisement

JAMUN FRUITS BENEFITS: చిన్న పండు.. గొప్ప లాభాలు.. ఆహారంలో ఈ పండును చేర్చుకుంటే బోలేడు ప్రయోజనాలు

JAMUN FRUIT HEALTH BENEFITS TELUGU: వర్షాకాలంలో మనందరికీ ఎక్కడా చూసినా కన్పించే పండు నేరేడు. ఈ నేరేడు పండు రుచి వగరు,తీపితో ఉన్నప్పటికీ.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. అయితే ఏ సీజన్ లో దొరికే పండ్లను.. ఆ సీజన్ లో ఖచ్చితంగా తినాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అసలు ఈ నేరేడు పండు తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

JAMUN FRUITS BENEFITS: చిన్న పండు.. గొప్ప లాభాలు.. ఆహారంలో ఈ పండును చేర్చుకుంటే బోలేడు ప్రయోజనాలు

JAMUN FRUIT:ప్రకృతి మనకు ఇచ్చిన ఆయురారోగ్య వరం ఈ నేరేడు పండు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడా చూసినా మనకు నేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. ఈ జామున్ ఫ్రూట్‌ లో మంచి పోషకాలతో పాటు.. ఎన్నో అనారోగ్యాలను నివారించే శక్తి కూడా అంతే ఉంది.  పురాతన ఆయుర్వేద వైద్యంలో  కూడా నేరేడు పండుకు చాలా ముఖ్యమైన స్థానమే ఉంది. ప్రకృతి సిద్దంగా లభించే ఈ నేరేడు పండు.. మన ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాల్లో జౌషధంగా పనిచేస్తుంది. ఈ నేరేడు పండులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు నేరేడులో పుష్కలంగా ఉంటాయి. 

డయాబెటిస్ పేషెంట్లకు వరంగా..
 
నేరేడు పండులో ఉండే జాంబోలిన్ అనే పదార్థం.. రక్తంలో షుగర్ లెవెల్ ని నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఓ పరిశోధనలో కూడా ఈ పండ్లు తిన్నవారిలో షుగర్ లెవెల్ 30 శాతం వరకు తగ్గినట్లు తేలింది. అంతేకాకుండా రోజు ఈ నేరేడు పండు తింటే.. తరచుగా మూత్ర విసర్జన, విపరీతమైన దాహం వంటి లక్షణాలు కూడా డయాబెటిస్ పేషెంట్లలో కన్పించవు. అలాగే ఈ నేరేడు పండ్లని పొడి చేసుకొని రోజూ తింటే.. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్ కి ఎంతో మేలు జరుగుతుంది.  

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. 

నేరేడు పండు మన శరీరానికి తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ ని అందించి.. జీర్ణ వ్యవస్థలో గల క్రిములను సంహరించడానికి బాగా పనిచేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా.. జీర్ణక్రియను శుభ్రంగా ఉంచుతుంది.అంతేకాకుండా జీర్ణ సంబంధమైన వ్యాధులు, డయోరియా, అజీర్ణం వంటి రోగాలకు నేరేడు బాగా పనిచేస్తుంది. 

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

నేరేడు పండులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో.. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకల బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 4-6 నేరేడు పండ్లు తింటే మన శరీరానికి ఎంతో మంచిది.

హృదయానికి ఎంతో మేలు..

నేరేడులో ఆంథోసైనిడిన్స్ ఎలిజియక్ ఆమ్లము, ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల.. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపి.. గుండె జబ్బులకు కారణమైన ప్లేగ్స్ ఏర్పడకుండా చూస్తాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తక్కువవుతాయి.

చర్మ సంరక్షణకు.. 

ఈ జూమున్ ఫ్రూట్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటంతో.. మన ముఖ సౌందర్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. నేరేడు గుజ్జును ఫేస్ మాస్క్ గా తయారు చేసుకొని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నేరేడు పండు సీజనల్ ఫ్రూట్ అయినప్పటికీ.. దీని విత్తనాలు, ఆకులను మనం సంవత్సరమంతా ఉపయోగించవచ్చు. నేరేడు పండ్లను మీ రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకొని.. ఆరోగ్యానికి మెరుగైన దారిని ఎంచుకోండి.

 Also Read : జూలై 16న యెమెన్‌లో నిమిష ప్రియకు  ఉరితీత.. కాపాడలేని స్థితిలో భారత్‌, ఒక్క ఛాన్స్‌..!

 Also Read : వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే కడతేర్చిన కూతురు.. సెకండ్ షో వెళ్లి, సినిమాలకు మించిన ట్విస్టులు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Read More