Corona cases in hyderabad: కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్న దేశం బయట ఉన్న వైరస్ ఇప్పుడు మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ, ముంబైని గడగడలాడిస్తున్న కొవిడ్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉనికిని చాటుకుంటోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో తొలి కేసు నమోదు అయిన సంగతి మరవక ముందే తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకడం కలకలం రేపింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గాంధీ హాస్పిటల్‌లో 35 బెడ్లతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో 60శాతం వరకు ఈ వైరస్ నమోదవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎలాంటి భయాలు వద్దని, తమ వద్ద స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. అలాగే కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేసింది. ప్రజలు శానిటైజర్స్ తో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.