Holiday For Schools: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తనే ఇది. ఎందుకంటే ఒకేసారి ఊహించని రీతిలో భారీ ఎత్తున 10 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వచ్చేశాయి. ఒక్క పాఠశాలలకే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించారు. మొన్ననే వేసవి సెలవులు ముగిసి కొన్ని వారాలు కాకముందే ఈ సెలవులు రావడం గమనార్హం. అసలు ఇన్ని రోజులు ఎందుకు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం. పది రోజుల సెలవులు ఎక్కడ? ఎందుకు ఇచ్చారో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Salaries Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. జీతాలు 30-34 శాతం పెరిగే ఛాన్స్!
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని ప్రధాన నగరం హరిద్వార్. పవిత్రమైన హిమనీ నదులకు ప్రఖ్యాతి గాంచింది. హరిద్వార్‌లో ప్రతియేటా శ్రవణ్ కన్వార్ యాత్ర పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. శ్రావణమాసం సందర్భంగా శివ భక్తులు యాత్ర చేస్తుంటారు. ఈ యాత్ర చేసేవారిని కన్వారీస్ అంటారు. లక్షలాది మంది భక్తులు కన్వార్ యాత్ర చేపడుతుండడంతో హరిద్వార్ మొత్తం శివ నామస్మరణతో మార్మోగనుంది. లక్షలాది భక్తులు పాల్గొంటుండడంతో హరిద్వార్ జిల్లా చాలా కిక్కిరిసి ఉంటుంది. దీంతో పాఠశాలలు కొనసాగితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: Passport Lose: విదేశాల్లో పాస్‌పోర్టు పోయిందా? కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించాలి
కన్వర్ యాత్ర నేపథ్యంలో హరిద్వార్ జిల్లా పాలనా యంత్రాంగా పాఠశాలలకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటిస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ ప్రకటించారు. జూలై 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్, రద్దీని నియంత్రించడానికి యాత్రికులు, స్థానికుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: New Wine Industry: డ్రింకర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే వార్త.. తెలంగాణలో భారీ వైన్ పరిశ్రమ
శ్రావణ కన్వర్ మేళా-2023ను పురస్కరించుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. శివ భక్తుల కన్వర్ తీర్థయాత్రకు అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యార్థుల భద్రత కోసం ఈ పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు అక్కడి విద్యా శాఖ అధికారులు వివరించారు. ఇలా హరిద్వార్‌లో ప్రతి సంవత్సరం పాఠశాలలకు సెలవు ఇస్తుంటారని సమాచారం.
Also Read: KCR Health: కుదుటపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం.. నదీ జలాలపై ఆందోళన
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కొసమెరుపు ఇంకో అంశం ఉంది. పాఠశాలలకు సెలవులు మాత్రమే ప్రకటించారు కానీ విద్యార్థులకు కాదు. ఎందుకంటే పాఠశాలలు మాత్రమే మూసి ఉంటాయి. విద్యార్థులకు మాత్రం తరగతులు కొనసాగుతాయని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. పాఠశాలలు మూసివేసి ఉన్న 10 రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులకు తప్పక పాఠ్యాంశాలు బోధంచాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మెలికతో విద్యార్థులు అయ్యో అని బాధపడుతున్నారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు కావడంతో హాజరు తప్పనిసరి కాదని భావిస్తూ విద్యార్థులు తప్పించుకునే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook