Home> జాతీయం
Advertisement

8th Pay Commission Update: జనవరి నుంచి భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు, ఎంతో తెలుసా

8th Pay Commission Update: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. అధికారికంగా కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు అందరు ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అయితే ఎప్పటి నుంచనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

8th Pay Commission Update: జనవరి నుంచి భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు, ఎంతో తెలుసా

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 జనవరి 1 నుంచే అమల్లోకి రావల్సి ఉన్నా..కమీషన్ ఏర్పాటులో ఆలస్యం కారణంగా 2027లోనే అమలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఎప్పుడు అమల్లోకి వచ్చినా ఉద్యోగుల జీతాలు మాత్రం గణనీయంగా పెరగనున్నాయి. 

ప్రతి పదేళ్లకు ఓసారి కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పరుస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని ఏర్పర్చినా ఇంకా కమీషన్ ఏర్పాటు జరగలేదు. ఈ ప్రక్రియ ముగిసేందుకు మరి కొంతకాలం పడుతుంది. కొత్త వేతన సంఘం ప్రకారం వేతన సవరణలో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 నిర్ణయించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే 8వ వేతన సంఘంలో కనీస వేతనం 18 వేల నుంచి 34,560 అవుతుంది. డీఏ 10,260 నుంచి 19,699 రూపాయలు అవుతుంది. 

ఇక గ్రాస్ శాలరీ 40,930 రూపాయల నుంచి 58,374 అవుతుంది. ఓవరాల్‌గా చూస్తే గ్రాస్ శాలరీ 52,898 రూపాయలు అవుతుంది. 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరుగుతుంది. మొత్తానికి ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 

Also read: IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్షాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More