Heavy Rains: గత వారం రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలగనుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ఎండల నుంచి ఇక పూర్తిగా రిలీఫ్ లభించనుంది. రుతు పవనాలు మళ్లీ పుంజుకోవడంతో తిరిగి వర్షాలు ప్రారంభం కానున్నాయి.
కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అదే విధంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జూన్ 7 నుంచి 10 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. జూన్ 9 అంటే రేపటి నుంచి జూన్ 13 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడలో రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్ర వర్ష సూచన ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది.
ఇక తెలంగాణలో కూడా వర్షాలు పడనున్నాయి. ఉదయం ఉత్తర తెలంగాణలో, మద్యాహ్నం హైదరాబాద్, మద్య తెలంగాణలో, సాయంత్రం దక్షిణ తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఏపీలో కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి. కర్నూలు, అనంతపురం, కడపలో భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఇవాళ మాత్రం ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి నుంచి వర్షాలు ప్రారంభం కావచ్చు. ఏపీలో 82 శాతం, తెలంగాణలో 85 శాతం తేమ ఉంటుంది.
బంగాళాఖాతంలో మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రుతు పవనాల్లో మళ్లీ కదలిక వచ్చింది. వచ్చే 5 రోజులు వర్షసూచన జారీ అయింది.
Also read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు: కర్నాటక ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook