Schools Holiday: విద్యార్థులకు అదిరిపోయే వార్త. మూడు రోజుల పాటు అన్నీ విద్యా సంస్థలకు సెలవులు వచ్చాయి. పాఠశాలలు.. కళాశాలలతోపాటు అన్నీ విద్యా సంస్థలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించిన సమయంలో ప్రత్యేకంగా ఈ సెలవులు ఏమిటి? ఎక్కడ సెలవులు ఇచ్చారో తెలుసా? పాకిస్థాన్‌లోని విద్యా సంస్థలకు అక్కడి అధికారులు సెలవులు ప్రకటించారు. భారత్‌తో ఏర్పడిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాక్ అధికారులు తమ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: CSK vs KKR: కోల్‌కత్తా ప్లేఆఫ్స్ దూరం? పరువు నిలబెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్
పహల్గమ్ ఉగ్రదాడి ఘటనతో భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' అంటూ భీకర దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున ప్రయోగించిన దాడితో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. అక్కడ కొన్ని ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. భారతదేశం చేసిన దాడిని పాకిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్ సరిహద్దు వెంట కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్‌తో ఏం చేయాలో అర్థం కావడం లేదు. భారతదేశంపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌పై ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడి గగనతలం మొత్తం మూసేశారు. విమాన ప్రయాణాలు నిలిపివేశారు.
Also Read: Rohit Sharma: పొమ్మనలేక పొగబెట్టారా? టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై!
ప్రతీకార దాడుల నేపథ్యంలో భారతదేశానికి సరిహద్దుగా ఉన్న తమ రాష్ట్రాల్లో ప్రభుత్వం అన్నీంటిని బంద్ పెట్టింది. పంజాబ్ ప్రావిన్స్‌లో మే 10వ తేదీ వరకు అన్నీ విద్యా సంస్థలకు అక్కడి పాకిస్థాన్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం పొంచి ఉండకుండా పాకిస్థాన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇక భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పాక్ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అన్నీ విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉగ్రవాదం అణచివేయాలని భారతదేశం పట్టుబడుతుండగా.. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతోంది. ఈ సమయంలో ఏం చేయనుందో అనీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.