Allergen Sensitization Analysis report 2025: భారతదేశంలో మొట్టమొదటిసారి 1000 మంది అలెర్జీ పేషెంట్ల రకాలు, వివిధ రకాలైన అలర్జీలు గురించి ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ కీలకంగా దీనిపై పలు అధ్యయనాలు చేసింది. అసలు..అలెర్జీ వేటి వల్ల ఎలర్జీ వస్తుంది.. ఏవిధంగా దీన్ని నియంత్రించవచ్చు వంటి పట్టికను, ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్ తాజాగా విడుదల చేశారు.
కోనో కార్పస్ మొక్క వలన, వాటి నుంచి వచ్చే పుప్పొడి వలన ప్రమాదం పొంచి ఉన్నదని 42% ప్రజలు దీనివల్ల వివిధ రకాలైన ఎలర్లతోనే బాధపడుతున్నారని నివేదికలో బైటపడింది. అదే విధంగా.. అత్యధికమైన అలెర్జీ, బొద్దింకల వలన, హౌస్ డస్ట్ మైట్ వలన, పార్థియం వయ్యారి భామ చెట్టు పొప్పడి వలన .. అలెర్జీ సమస్యలువస్తాయని నిర్ధారణ రిపోర్ట్ లో ఉన్న వివరాలు వెల్లడించారు. భారతదేశంలో అత్యధికంగా హైదరాబాదులోనే అశ్విని ఎలర్జీ సెంటర్ కేంద్రముగా 10 వేల మంది కంటే ఎక్కువగా అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనో థెరపీ అందించారని తెలిపారు.
అలర్జన్ స్పెసిఫిక్ ఇమినోథెరపీ అనే అత్యాధునికమైన చికిత్స విధానం కేవలం, అమెరికా, యూరోప్ ,లండన్ లాంటి ప్రాంతాల్లో ఉండేదని, గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. అలెర్జీ లకి ఇప్పటికి విరుగుడు ఎలర్జన్ ఇమినో థెరపీ అని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పర్యావరణ పదార్థాలు, పిండి పదార్థాలు, కోనో కార్పస్ వంటి వాటి డేటా, అలర్జీ వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ విడుదల చేశారు.
2020 కోవిడ్ వైరస్ తర్వాత అధికముగా రోగ నిరోధక శక్తి లో మార్పులు తెలుస్తున్నాయని, అత్యధికముగా హీష్టమైన్( histamine) రక్తంలో ఉత్పన్నం అవ్వడం జరుగుతున్నదని తెలిపారు. హిష్టమైన అని కెమికల్ వల్లనే అలర్జీలు ఎక్కువగా వ్యాప్తిస్తాయని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
అంతే కాకుండా వివిధ రకాలైన అలెర్జీల వలన పెదవులకు పుండ్లు రావడం, చెవులు ఎర్రగా మారడం, విపరీతముగా శ్వాసకోశ ఇబ్బంది రావడము, శరీరం మొత్తం దద్దులు రావడము, వంటి వచ్చినప్పుడు దాని యాంజియో ఎడిమా అంటారు. ఇటువంటి యాంజియో ఎడిమా వంటి ప్రమాదకరమైన పరిస్థితులు కనుక అశ్రద్ధ చేసినట్లయితే, ప్రాణపాయ పరిస్థితి Anaphylaxis వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
గుండెపోటు కంటే అతి భయంకరమైన పరిస్థితి ఎనాఫిలిటిక్ షాక్. ఎలర్జీ రోగులకు శరీరంలో విపరీతంగా ఎలర్జీ పెరగడం వల్ల అత్యధికమైన హిస్టమన్ రక్తంలో ప్రవహించడం వల్ల, యాంజియో ఎడిమా Anaphylaxis షాక్ వంటి ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. అనఫలైటిక్ షాక్ పేషెంట్ ని, గుర్తించి రోగ లక్షణాలు గమనించి, ఆసుపత్రికి తరలించి, ట్రీట్మెంట్ అందించే లోపు ఐదునిముషాలు మాత్రమే సమయం ఉంటుందని ఆలస్యమైనట్లయితే ప్రాణపరిస్థితి ఏర్పడుతుంది అని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
కరోనా రోగము ముందర నెలకి ఒకటి రెండు యాంజియో ఎడిమా Anaphylaxisకేసులు, ఆటో ఇమ్యూనిటీ వంటి రోగాలు చూసే వాడిని కానీ, ఇప్పుడు రోజుకు ఒక ఆటో ఇమ్యూనిటీ ఎలర్జీ పేషెంట్ చూడడమే కాకుండా యాంజియో ఎడిమా Anaphylaxis పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారని, ఎలర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేనట్లయితే ప్రాణాపాయ స్థితి వస్తుందని డాక్టర్ వ్యాకరణం హెచ్చరించారు.
అదే విధంగా.. 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కీలకమైన, అలర్జీ - ఆటో ఇమ్యూనిటీ, సమాచార డేటా విడుదల చేశారు. 42% ప్రజల్లో కోనో కార్పస్ వలన ఎలర్జీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో.. ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు గనినీయంగా పెరిగాయన్నారు.
Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్‌లో పాత పింఛన్ విధానం అమలు?
10,000 మంది రోగులకి పైగా, అత్యధికమైన ప్రపంచ స్థాయి, ఎలర్జీ ఇమినో థెరపీ చికిత్సను అశ్విని ఎలర్జీ సెంటర్ హైదరాబాద్ అందించిందన్నారు. 1800-425-0095.. భారతదేశపు మొట్టమొదటి అలర్జీ టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ నుంచే ప్రారంభమైందన్నారు. తినే పదార్థాల్లో విపరీతమైన కల్తీ పదార్థాలు, ఆల్కహాల్ లిక్కర్ తాగడం, విపరీతముగా మసాలాలు తినడం వల్ల అలెర్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా.. కోనో కార్పస్ వలన ఆడవారిలోనే అధిక ఎలర్జీలు సంభవిస్తాయన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.