Banks 4 Days Close: ఇప్పుడు అంటే డిజిటలీకరణ పెరగడంతో బ్యాంకింగ్ సేవలు సులభతరమయ్యాయి. కానీ గతంలో బ్యాంకులకు వెళ్లాలంటే ఒక రోజు పనులు వదులుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఎంత డిజిటల్ మారినా కూడా ఇప్పుడు కూడా బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అలాంటి బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయనే వార్త ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు..? ఎందుకో తెలుసా?
Also Read: GST Notice To Labour: జీఎస్టీ నోటీసులు చూసి కూలీ షాక్.. రూ.22 లక్షల జీఎస్టీ ఏంది సామి
తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి మార్చి 24, 25వ తేదీల్లో సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల సమ్మెకు తోడు 22, 23 తేదీల్లో నాలుగో శనివారం, ఆదివారం కావడంతో మొత్తం నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి. తమ డిమాండ్ల విషయంలో యూనియన్ ఆఫ్ బ్యాంక్స్ (యూఎఫ్‌బీయూ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రెండింటి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లనున్నాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లను ఐబీఏ అంగీకరించకపోవడంతో సమ్మె జరగనుంది.
Also Read: Agniveer Recruitment: ఏపీవాసులకు శుభవార్త.. సైన్యంలో చేరడానికి అగ్నివీర్ షెడ్యూల్ విడుదల
సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (ఎన్‌సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి సంఘాలు వెళ్లనున్నాయి. ప్రధాన సంఘాలన్నీ సమ్మెకు వెళ్లనుండడంతో బ్యాంకుల్లో ఖాతాదారులకు సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు.
బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook