Home> జాతీయం
Advertisement

Covid -19: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా..!

Covid -19: దేశంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. కోవిడ్‌ కేసుల పెరుగటంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేసులు రికార్డ్ అయ్యాయి.

Covid -19: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా..!

Covid -19: కోవిడ్ మన దేశాన్ని కలవరపెడుతుంది.  గత వారం రోజుల్లోనే 750 మంది కరోనా బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా కొత్త కేసులు పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 430కి పెరిగింది. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 209కు, ఢిల్లీలో 104కు పెరిగింది. గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదయ్యాయి.ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా మరో మూడు కేసులు రికార్డ్ అయ్యాయి.

గుంటూర్ తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. ఇందులో ఏలూరుకి చెందిన భార్యా భర్తలు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. ప్రస్తుతం వృద్దుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు హైదరాబాద్ లోనూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:   కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More