Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ వైరస్ మరోసారి భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ పేరు జేఎన్.1 అని తెలుస్తోంది.
వాస్తవానికి జేఎన్ .1 కోవిడ్ సబ్ వేరియంట్ కేసుల్ని ఇండియాలో గత ఏడాది అంటే 2024 జనవరిలోనే గుర్తించారు. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులో అధికంగా నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జేఎన్.1 అనేది BA.2.86 సబ్ వేరియంట్‌కు చెందిన మరో సబ్ వేరియంట్. ఈ మ్యూటేషన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దాంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. గత ఏడాది జనవరిలో ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ కేసులు వెలుగు చూసినప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కొన్ని సూచనలు జారీ చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, బూస్టర్ డోసులు అందిన ప్రతి వ్యక్తిలో ఈ వేరియంట్ లక్షణాలు భిన్నంగా కన్పించే అవకాశముంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ కారణంగా వచ్చిన ఇమ్యూనిటీతో లక్షణాల తీవ్రత మారవచ్చు. ప్రపంచదేశాల్ని కలవరం పెడుతున్న జేఎన్.1 వేరియంట్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ఇమ్యూనిటీ, ఆరోగ్య స్థితిని బట్టి మారుతుంటాయి.
జేఎన్.1 సబ్ వేరియంట్ లక్షణాలు
గొంతు నొప్పి, నిద్రలేమి, ఆందోళన, ముక్కు కారడం, దగ్గు, తలనొప్పి, అలసట, బాడీ పెయిన్స్ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, అలసట, తలనొప్పి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఫ్లూ లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. అందుకే వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
Also read: Free Education: పైసా లేకుండా కార్పొరేట్ స్కూల్స్‌లో చదివించొచ్చు, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి