Work From Home: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ప్రస్తుతం సిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఈదురుగాలులతో వాన బీభత్సం
కర్ణాటకలో కలవరం
కర్ణాటకతోపాటు బెంగళూరు నగరంలో కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 20 రోజుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తొమ్మిది నెలల పసికందుకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. కేసుల పెరుగుదలతో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. 'కర్ణాటకలో ఇప్పటివరకు 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 32 కేసులు ఒక్క బెంగళూరులోనే నిర్ధారణ అయ్యాయి' అని తెలిపారు. కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నా కూడా పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదని ప్రకటించారు.
Also Read: K Kavitha: 'కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి: కవిత సంచలన ప్రకటన
ఆరోగ్య జాగ్రత్తలు
'గర్భిణులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రద్దీ ప్రదేశాలకు వెళ్లిన సమయంలో విధిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వినియోగించాలి. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. సకాలంలో చికిత్స పొంది వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు' అని వైద్యారోగ్య శాఖ సూచనలు చేసింది.
భారతదేశంతోపాటు ప్రపంచ దేశాల్లో కరోనా విస్తృతి తీవ్రంగా ఉంది. సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా దేశంలో కేసుల నమోదు పెరుగుతోంది. సామూహికంగా ప్రజలు ఉండకుండా ప్రభుత్వాలతోపాటు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి. కరోనా మూడు దశల వ్యాప్తి అనంతరం ఉద్యోగుల పని విధానం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం వీలైనంత ఆఫీస్ విధానంలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కేసుల నమోదు పెరుగుతుండడంతో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే హైబ్రిడ్ విధానం అమలు చేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook