Sudden Death Govt Employee: ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు, కార్యక్రమాలను చేరువ చేసే బృహత్తర బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. ప్రభుత్వ సేవలో నిమగ్నమయ్యే ఆ ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? హఠాన్మరణం పొందితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అవగాహన కోసం తెలుసుకుంటే ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: EPFO Subscribers: పీఎఫ్‌లో పెంచిన వడ్డీ జమ అయ్యిందా.. మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్నారా?
విధుల్లో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం కొన్నిసార్లు రోడ్డున పడిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంపై ఆధారపడి ఇల్లు, రుణాలు, వాహనాలు కొనుగోలు చేసి ఉంటారు. ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోవడమే కాకుండా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాతాయి. ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టే ప్రమాదం ఉండడంతో అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పిస్తోంది. ఆ ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
Also Read: RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు జాక్‌పాట్.. డిమాండ్లపై యాజమాన్యం కీలక ప్రకటన
ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం తరఫున కుటుంబీకులకు దక్కే ప్రయోజనాలు ఇవే..
అంత్యక్రియలు: ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం లభిస్తుంది. అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం కొంత నిధులు చెల్లిస్తుంది.
కారుణ్య నియామకాలు: ఉద్యోగి మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుంది. అంతేకాకుండా ప్రధాన ఆదాయంగా ఉన్న ఉద్యోగం కూడా పోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరణించిన వ్యక్తి ఉద్యోగాన్ని ఆ కుటుంబానికి ఇస్తారు. దీనిని కారుణ్య నియామకం అంటారు. మరణించిన వ్యక్తికి ఉన్న అర్హతలు ఉంటే ఆ ఉద్యోగం లభిస్తుంది. లేకుంటే ఆ కుటుంబంలోని ఉన్న వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు.
జీతభత్యాలు: ఉద్యోగికి చెల్లించవలసిన జీతభత్యాలు ఉద్యోగి మరణం అనంతరం లభిస్తాయం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది.
ఫ్యామిలీ పెన్షన్: మరణించిన కుటుంబాన్ని బట్టి బాధిత కుటుంబానికి ఫ్యామిలీ పింఛన్ ప్రభుత్వం నుంచి అందుతుంది.
గ్రాట్యూటీ: ఆర్థికంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం గ్రాట్యూటీ చెల్లిస్తుంది.
ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్: మృతిచెందిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ లభిస్తుంది.
గ్రూప్ ఇన్సూరెన్స్: ఆకస్మిక మృతితో కుటుంబం అగాథంలో పడకుండా గ్రూపు ఇన్సురెన్స్ అందిస్తుంది.
ప్రావిడెంట్ ఫండ్: ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం లభిస్తుంది.
రుణాలు రద్దు: ఆకస్మికంగా ఉద్యోగి మరణిస్తే ఆయన తీసుకున్న రుణాలు, అడ్వాన్సులు, బకాయిలు ఏమైనా ఉంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. వాహన, గృహ, వ్యక్తిగత రుణం తదితర రుణాలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం రద్దు చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి