Maharashtra: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. విద్యా బుద్దులు నేర్పాల్సిందిపోయి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పనులకు పాల్పడుతున్నాయి. బాలికలు పీరియడ్స్ ఉన్నారో లేదో చెక్ చేసేందుకు బట్టలు విప్పిన దుస్సాహస నీచమైన పని చేసింది.
ఆ స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు. మహరాష్ట్రలో జరిగిన ఘోరమైన సంఘటన ఇది. బాలికల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన యాజమాన్యం ఇది. బాత్‌రూంలో రక్తపు మరకలు ఉండటంతో ఎవరు పీరియడ్స్‌లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ఎవరూ చేయకూడని ఘోరమైన పనికి పాల్పడ్డారు. పీరియడ్స్‌లో ఉన్నామని ఆ బాలికలే చెబుతున్నా వినకుండా బాత్‌రూమ్‌లో తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసింది. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన అనైతిక పని ఇది. బాలికలు అందరినీ వరుసగా నిలబెట్టి బలవంతంగా బట్టలు విప్పి పీరియడ్స్ స్టేటస్ చెక్ చేసింది. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఇది ఠాణే జిల్లాలో జూలై 8వ తేదీన జరిగింది.
స్కూల్‌లో 5 నుంచి 10 చదువుతున్న విద్యార్థినులను పిలిపించి స్కూల్ ప్రిన్సిపాల్ మహిళా ఉపాధ్యాయురాలితో బాలికల్ని బాత్‌రూమ్‌లో తీసుకెళ్లమని చెప్పింది. అక్కడ ఆ బాలికల బట్టలు విప్పి ప్రైవేట్ భాగాలను చెక్ చేయించింది. ఈ ఘటనపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సహా అటెండెంట్‌ను అరెస్టు చేశారు. ఉపాధ్యాయులు, ట్రస్టీలపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
Also read: Registration Act: కొత్త రిజిస్ట్రేషన్ చట్టం, కలెక్టర్లకే ఆ అధికారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook