Ministers to undergo covid rtpcr before meet with pm modi: దేశంలో కరోనా మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య..7 వేలు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి దేశంలో అలర్ట్ ను ప్రకటించింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 309 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి.
దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,121కి చేరింది. ఇప్పటివరకు దేశంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 78కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనల్ని పాటించాలని, సామాజిక దూరం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లను పెట్టుకొవాలని కేంద్రం సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో.. పీఎంవో పెరుగుతున్న కరోన కేసుల దృష్ట్యా.. ఇక మీదట ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు వచ్చే అధికారులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, అందరు కూడా.. తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా కేసుల్లో గుజరాత్ తొలిస్థానంలో.. 1,225 , ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ.. 760 కేసులు నమోదయ్యాయి.
Read more: PM Kisan: 20వ విడుత నిధులపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు ఆలస్యం కాకూడదంటే ఈ పని పూర్తి చేశారా?
ఇవి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 72 యాక్టివ్ కేసులు ఉండగా, తెలంగాణలో 11 కేసులు నమోదయ్యాయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తమయ్యాయి. కరోనా సోకిన వాళ్ల కోసం ప్రత్యేకమైన వార్డులు, బెడ్ లను సిద్దం చేశారు. కోవిడ్ వ్యాప్తితో ప్రజలు ఒకింత ఆందోళనకు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook